సినీ తారల ఇంట్లో వేడుకలంటే అట్టహాసంగా జరగాల్సిందే. అదే ఓ సినిమా సెటప్‌లా ఉంటుంది. అయితే... కరోనా కాలం కదా? ఆ హడావుడిలకు చోటులేదిప్పుడు. పెళ్లయినా, పుట్టిన రోజు అయినా గప్ చుప్‌గా చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. దర్శకుడు సుజిత్ నిశ్చితార్థం కూడా ఇప్పుడు అంతే సింపుల్‌గా అయిపోయింది.
రన్ రాజా రన్ తో ఆకట్టుకున్న దర్శకుడు సుజిత్. ఒక్క సినిమాతోనే ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో పనిచేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. రెండో సినిమాకే దాదాపు 250 కోట్ల బడ్జెట్ నీ, ఓ అంతర్జాతీయ స్టార్‌నీ మోశాడు. త్వరలో చిరంజీవితోనూ కలసి పని చేయబోతున్నాడు. ఆ సుజిత్.. ఇప్పుడు నిశ్చితార్థం చేసుకున్నాడు. సుజిత్ - ప్రవళిక నిశ్చితార్థం హైదరాబాద్ లో సింపుల్ గా జరిగిపోయింది. త్వరలోనే పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టబోతున్నారు. పెళ్లి కూడా ఇంతే సింపుల్‌గా చేసుకోవాలని సుజిత్ భావిస్తున్నట్టు టాక్. అయితే ముహూర్తం, వేదిక ఖరారు కావాల్సివుంది.