రన్‌రాజా రన్‌తో సూపర్ హిట్టు కొట్టి తొలి ప్రయత్నంలోనే ఆకట్టుకున్నాడు సుజిత్. ఆ వెంటనే ప్రభాస్‌తో సాహో తెరకెక్కించాడు. ఇప్పుడు చిరంజీవితో లూసీఫర్ తెరకెక్కిస్తున్నాడు. తన నిశ్చితార్థం నిన్ననే . ప్రవళ్లిక అనే వైద్యురాలితో సింపుల్‌గా జరిగిపోయింది. వచ్చే యేడాది వీళ్ల పెళ్లి చేయాలని ఇరు కుటుంబ వర్గాలూ నిర్ణయించుకున్నాయి.
అయితే వీళ్లది ప్రేమ వివాహం అని తెలుస్తోంది. సుజిత్ షార్ట్ ఫిల్మ్స్ తీసి.. క్రమంగా దర్శకుడయ్యాడు. ఆ సమయంలోనే ప్రవళ్లికతో పరిచయం ఏర్పడింది. క్రమంగా అది ప్రేమగా మారింది. ఇప్పుడు పెద్దవాళ్లని ఒప్పించి, పెళ్లి చేసుకుంటున్నారు. ప్రస్తుతం లూసీఫర్ స్క్రిప్టు పనుల్లో బిజీగా ఉన్నాడు సుజిత్. `ఆచార్య` పూర్తయ్యాకే ఈ సినిమా పట్టాలెక్కుతుంది. `లూసీఫర్` పూర్తయ్యాకే పెళ్లి చేసుకోవాలని సుజిత్ భావిస్తున్నట్టు సమాచారం.