సత్యం, ధన 51, రాజూభాయ్ లాంటి సినిమాలతో ఆకట్టుకున్నాడు సూర్య కిరణ్. సడన్‌గా కనిపించకుండా పోయాడు. సూర్యకిరణ్ ఎక్కడికి వెళ్లాడు? ఏమైపోయాడు? ఎందుకు కనిపించడం లేదు? అనుకున్నారంతా. బిగ్ బాస్ సీజన్ తో సూర్య కిరణ్ మళ్లీ వెలుగులోకి వచ్చాడు. ఈ గ్యాప్‌లో ఏమైందన్న విషయాన్ని తనే చెప్పుకొచ్చాడు. ఒకే ఒక్క సినిమా తన జీవితాన్ని మర్చేసింది. పది కోట్ల నష్టంతో దివాళా తీసేశాడు. దాంతో తన జీవితం చిన్నా భిన్నమైంది. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నాడట.
''ఓ సినిమాతో 10 కోట్లు నష్టపోయా. ఇంట్లో నాలుగు కార్లు ఉండేవి. అవన్నీ బ్యాంకు వాళ్లు పట్టుకెళ్లిపోయారు. స్నేహితుడి బండిపై తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ సమయంలో కొంతమంది స్నేహితులు ఆదుకున్నారు. కానీ... నా అర్థాంగి కల్యాణీ నా నుంచి విడిపోయింది. జీవితంలో చాలా కోల్పోయిన ఫీలింగ్. దాదాపుపగా 300సార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. కానీ. ఆ ప్రయత్నం విరమించుకున్నా' అని చెప్పుకొచ్చాడు సూర్య కిరణ్.
ఇప్పుడు మళ్లీ సినిమాలు తీసి లైమ్ లైట్ లోకి రావాలనుకుంటున్నాడు. `సూత్రధారి` అనే స్క్రిప్టు సూర్య కిరణ్ దగ్గర రెడీగా ఉంది. ఈ సినిమాతో మళ్లీ కమ్ బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నాడు ఈ దర్శకుడు.