ఎంతో ప్రతిష్టాత్మకంగా అదేసమయంలో భారీ అంచనాలతో ఈ మధ్యనే ఎన్టీఆర్ బయోపిక్ ని హీరో బాలకృష్ణ మొదలుపెట్టాడు. అయితే ఈ చిత్రానికి ఎవరు ఊహించని ఒక పెద్ద షాక్ తగిలింది.
ఆ వివరాల్లోకి వెళితే, ఎన్టీఆర్ బయోపిక్ కి దర్శకత్వం వహిస్తున్న దర్శకుడు తేజ ఇప్పుడు ఆ బాధ్యతల నుండి తప్పుకున్నాడు. ఈ నిర్ణయానికి ప్రస్తుతం తెలియవస్తున్న కారణమేమిటంటే- దర్శకుడు తేజ స్వతహాగా కథ రాసుకుని దానికి తగ్గట్టుగా నటీనటుల్ని ఎంపిక చేసుకుని దర్శకత్వం వహించే పద్ధతి.
అయితే ఈ చిత్రం విషయంలో కథ మొత్తం ఇప్పటికే సిద్ధంగా ఉంది అలాగే దర్శకత్వం కూడా ఈ చిత్రానికి తనదైన సహజ శైలిలో చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ చిత్రాన్ని అనుక్షణం పరిశీలించే వారు చాలా మంది ఉన్నారు.
దీనితో ఆయన ఈ చిత్రం నుండి తప్పుకున్నట్టుగా సమాచారం. ఏదేమైనా ఇది ఎన్టీఆర్ అభిమానులకి పెద్ద షాక్ అనే చెప్పాలి.