కిక్కిస్తోన్న కైరా అద్వానీ

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌ బ్యూటీ కైరా అద్వానీ తొలి సినిమాకే హిట్‌ కొట్టింది. రావడం రావడమే స్టార్‌ హీరోలతో నటించే గోల్డెన్‌ ఛాన్స్‌ దక్కించుకుంది. 'భరత్‌ అనే నేను' సినిమా ప్రమోషన్స్‌లో యాక్టివ్‌గా పాల్గొంటోంది. ప్రమోషన్స్‌లో కైరా అప్పియరెన్స్‌కి అభిమానులు ఫిదా అయిపోతున్నారు.

 

బాలీవుడ్‌ బ్యూటీ అయినా కానీ ఆమె డ్రస్సింగ్‌ సెన్స్‌, మాట్లాడే తీరు అందర్నీ విశేషంగా ఆకట్టుకుంటోంది. దాంతో కైరాకి తెలుగులో ఘన స్వాగతం అందిందనే చెప్పాలి. ఇక నెక్స్ట్‌ చరణ్‌ సినిమాతో మరోసారి సందడి చేయనుంది కైరా అద్వానీ. 'భరత్‌' విజయంతో కైరాకి మరిన్ని ఆఫర్స్‌ క్యూలో ఉన్నాయనీ టాలీవుడ్‌ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. స్టార్‌ హీరోలే కాదు, ఫామ్‌లో ఉన్న యంగ్‌ హీరోలు కూడా కైరా అద్వానీతో నటించాలని కుతూహలంగా ఉన్నారట. 

ఒకప్పుడు హీరోయిన్స్‌ స్టార్‌ హీరోలతో నటిస్తే, తర్వాత ఇక చిన్న హీరోల వంక చూసేవారే కాదు. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. హీరోయిన్స్‌ ఆలోచనలో మార్పులొచ్చాయి. ఏకకాలంలో ఇటు స్టార్‌ హీరోలతోనూ, అటు యంగ్‌ హీరోస్‌తోనూ నటిస్తున్నారు. దాంతో కైరా డేట్స్‌ కోసం ఇప్పటికే పలువురు యంగ్‌ హీరోలు ప్రయత్నాలు మొదలెట్టేశారని తెలుస్తోంది. 

కాగా బోయపాటి శీను - చరణ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమాలో నటించేందుకు కైరా అద్వానీ తెగ ఉబలాటంగా ఎదురు చూస్తోందట. ముఖ్యంగా డాన్సుల కోసం చరణ్‌తో జోడీ కట్టేందుకు ఆరాట పడుతోందట. మొత్తానికి టాలీవుడ్‌కి కైరా ఎంట్రీతో న్యూ గ్లామర్‌ యాడ్‌ అయ్యింది. గ్లామర్‌తో పాటు, సక్సెస్‌ బోనీ కూడా కొట్టేసింది. దాంతో అమ్మడికి రానురాను డిమాండ్‌ ఓ రేంజ్‌లో పెరిగిపోతుందనడంలో సందేహం లేదనిపిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS