నిర్మాత‌గా మ‌రో ద‌ర్శ‌కుడు

మరిన్ని వార్తలు

ఈత‌రం ద‌ర్శ‌కుల‌కు ఓ అల‌వాటు ఉంది. ద‌ర్శ‌కులుగా ఉంటూనే, నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు. త‌మ అభిరుచికి త‌గిన క‌థ‌ల్ని ఎంచుకుంటూ - సినిమాలు తీస్తున్నారు. త‌మ‌లాంటి మ‌రో ద‌ర్శ‌కుడ్ని ప్రోత్స‌హిస్తున్నారు. ఇప్పుడు వేణు ఉడుగుల కూడా నిర్మాత‌ల జాబితాలో చేరిపోతున్నాడు. అయితే సినిమా కోసం కాదు. ఓ వెబ్ సిరీస్ కోసం. ఆహా కోసం వేణు ఉడుగుల ఓ వెబ్ సిరీస్ నిర్మించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

 

చ‌లం పాపుల‌ర్ న‌వ‌ల `మైదానం`ని వెబ్ సిరీస్ గా తీయ‌బోతున్నారు. ఓ ప్ర‌ముఖ క‌థానాయిక‌గా ఈ వెబ్ సిరీస్ లో న‌టించ‌బోతోంద‌ని స‌మాచారం. ఇద్ద‌రు ముగ్గురు క‌థానాయిక‌ల‌తో ప్రస్తుతం సంప్ర‌దింపులు జ‌రుగుతున్నాయి. వారిలో ఓ నాయిక‌ని ఎంపిక చేసి త్వ‌ర‌లోనే అధికారికంగా ప్ర‌క‌టిస్తారు. ప్ర‌స్తుతం వేణు ఉడుగుల `విరాట‌ప‌ర్వం` సినిమాతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS