పవన్ - రేణూ దేశాయ్ విడిపోయినప్పటి నుంచీ `రేణూ దేశాయ్ రెండో పెళ్లి ఎప్పుడు` అనే ప్రశ్నపుడుతూనే వచ్చింది. పవన్ మరో పెళ్లి చేసుకున్నట్టే, రేణూ కూడా కొత్త బంధాన్ని వెదుక్కుంటూ మరో ఇన్నింగ్స్‌ని ప్రారంభిస్తుందనుకున్నారు. కొంతమంది ఫ్యాన్స్ `మీరు రెండో పెళ్లి చేసుకోవొద్దు` అని రేణూని అడగడం.. దానికి రేణూ కూడా ధీటుగా సమాధానం చెప్పడం తెలిసిన విషయాలే.
ఆమధ్య రేణూ నిశ్చితార్థం జరిగిపోయినట్టు వార్తలొచ్చాయి. అందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట్లో హల్ చల్ చేశాయి. రేణూ రెండో పెళ్లి గప్ చుప్ గా జరిగిపోయిందనుకున్నారంతా. అయితే వీటిపై రేణూ మళ్లీ స్పందించింది. ''నా వ్యక్తగత జీవితం గురించి తెలుసుకోవాలని చాలామంది అర్థం లేకుండా ఆరాటపడుతున్నారు. నా పెళ్లి సంగతి మీకెందుకు? అయినా నేను రెండో పెళ్లి చేసుకోలేదు. అప్పటి ఫొటోలు కూడా... ఓ సినిమాలో, పెళ్లి సన్నివేశంలో తీసినవే'' అంటూ క్లారిటీ ఇచ్చింది. అంటే.. అప్పటి నిశ్చితార్థం, పెళ్లి విషయాల్లో ఎలాంటి నిజం లేదన్నమాట. రేణూ దృష్టంతా ఇప్పుడు సినిమాలు - నటన - దర్శకత్వం - పిల్లలపైనే ఉంది. అకీరాని హీరోగా చేయడమే రేణూ లక్ష్యంగా కనిపిస్తోంది. అందుకు తగిన కసరత్తులు కూడా అకీరా మొదలెట్టాడని టాక్.