రవితేజ 'డిస్కోరాజా' గ్రాండ్ రిలీజ్.

మరిన్ని వార్తలు

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం డిస్కోరాజా. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 2నుంచి గోవాలో కీలకమైన షెడ్యూల్ ప్లాన్ చేశారు. మరోవైపు డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని క్రిస్ మస్ కానుకగా డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాత రామ్ తల్లూరి ప్రకటించారు.

 

అలాగే సెప్టెంబర్ 2న వినాయక చవితి సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తున్నారు. మహారాజా రవితేజ, వి ఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రామ్ తళ్లూరి నిర్మాణంలో, సాయి రిషిక సమర్పణలో, రజిని తళ్లూరి ఈ చిత్రాన్ని గ్రాండియర్ గా నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత రామ్ తల్లూరి మాట్లాడుతూ... మాస్ రాజా రవితేజతో, వి ఐ ఆనంద్ దర్శకత్వంలో మా బ్యానర్లో నిర్మిస్తున్న డిస్కోరాజా చిత్రాన్ని డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేయనున్నాం.

 

సెప్టెంబర్ 2న వినాయక చవితి సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేస్తాం. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్, ఢిల్లీలోని విభిన్నమైన ప్రాంతాల్లో, లొకేషన్స్ లో షూటింగ్ చేశాం. ఆర్ ఎక్స్ 100 ఫేమ్ పాయల్ రాజ్ పుత్, నన్ను దోచుకుందువటే ఫేమ్ నభా నటేష్, హాట్ బ్యూటీ తాన్యాహోప్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ హాంగులతో, గ్రాఫిక్స్ కి పెద్దపీట వేసి నిర్మిస్తున్నాం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS