సంచలనాలు సృష్టిస్తోన్న 'డిస్కో రాజా' లిరికల్‌ సాంగ్‌.!

మరిన్ని వార్తలు

రవితేజ తాజా చిత్రం 'డిస్కో రాజా' త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్‌ ప్రమోషన్‌ కార్యక్రమాలు షురూ చేసింది. ఆ క్రమంలో ఓ లిరికల్‌ సాంగ్‌ని విడుదల చేసింది. 'నువ్వు నాతో ఏమన్నావో.. నేనేం విన్నానో..' అంటూ సాగే ఈ లిరికల్‌ సాంగ్‌ ప్రశంసలు అందుకుంటోంది. చాలా కాలం తర్వాత ఓ మంచి పాట చెవులకు వినపడిందనే టాక్‌ వినిపిస్తోంది. ఇటీవల కాలంలో ఇలాంటి సాంగ్‌ విననే లేదు. పాటలో మాట వినబడి చాలా కాలం అయ్యింది.

 

అలాంటిది ఈ పాటలోని ప్రతీ లిరిక్‌ చెవులకు వీణుల విందుగా తాకుతుంటే, ఫీలవ్వని ప్రేక్షకుడుంటాడా? అనిపించేంతలా ఈ లిరికల్‌ సాంగ్‌ ఉండడంతో, ఈ పాటపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. యూ ట్యూబ్‌ వ్యూస్‌ కౌంట్‌ బేస్‌ చేసుకుని ఈ మధ్య పాటల్ని సూపర్‌ హిట్‌ అంటున్నారు. కానీ, ఓ మంచి పాట విన్నామన్న భావన ఎవ్వరిలోనూ వ్యక్తం కావడం లేదు. ఆ లోటు 'డిస్కో రాజా'లోని ఈ తాజా సాంగ్‌తో కలిగింది. తమన్‌ మ్యూజిక్‌ అందించిన ఈ పాటకు సీతారామ శాస్త్రి లిరిక్స్‌ రాశారు.

 

గాన గంధర్వుడు ఎస్‌.పి. బాలసుబ్రహ్మణ్యం గొంతులో పడి ఈ పాటకు మరింత మాధుర్యం తోడయ్యింది. టైమ్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌తోనే అంచనాలు క్రియేట్‌ చేసింది. ఇక ఈ పాట ఆ అంచనాల్ని నెక్స్‌ట్‌ లెవల్‌కి తీసుకెళ్లింది. పాయల్‌ రాజ్‌పుత్‌, నభా నటేష్‌ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS