'తిట్టేవాళ్లు లేకుంటే, టాలెంట్ అలా బయటికొచ్చేస్తుందన్న మాట..' అంటూ నాగార్జున రాహుల్‌ని మెచ్చుకున్నాడు. అంటే, పునర్నవి లేకపోవడం వల్ల రాహుల్ నిజ స్వరూపం అంటే, నిజమైన టాలెంట్ బయటికొస్తుందనే అభిప్రాయంతో నాగార్జున అలా అన్నాడు. హౌస్‌లో క్యూట్ అండ్ రియల్ కపుల్ అయిన వరుణ్ వితికలతో పాటు, రాహుల్, పునర్నవి కాంబినేషన్‌కీ మంచి క్రేజ్ ఏర్పడింది ఈ సీజన్‌లో. అయితే, హౌస్‌లో ఉన్నంతవరకూ పునర్నవి, రాహుల్‌ని చిన్నదానికీ, పెద్ద దానికీ తిడుతూనే ఉండేది.
ఆఖరికి తాను ఎలిమినేట్ అయ్యే వారంలో ఆఫ్ట్రాల్ డెట్టాల్ కోసం పునర్నవి, రాహుల్‌తో చేసిన రచ్చ రంభోలా అంతా ఇంతా కాదు. అయితే, వీరిద్దరి మధ్యా మాటల్లో చెప్పలేనంత బెస్ట్ ఫ్రెండ్‌షిప్ ఉందని పునర్నవి వెళ్లిపోయాక రాహుల్ ఎమోషనల్ ఫీల్‌తో అర్ధం చేసుకోవచ్చు. బయటికొచ్చాక కూడా పునర్నవి, రాహుల్ తనకెంతో స్పెషల్ అని చెప్పుకొచ్చింది. ఈ సంగతి పక్కన పెడితే, పునర్నవి బయటికొచ్చేశాకా, రాహుల్ హౌస్‌లోని మిగిలిన వారితో కూడా ఫ్రెండ్లీగా కలిసిపోయాడు. ముఖ్యంగా అలీ, రాహుల్ మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అలీ కోసం రాహుల్ తన రెండో స్థానాన్ని త్యాగం చేసేశాడు కూడా. ఇలా వీరిద్దరూ లంబూ జంబూల్లా హౌస్‌ని ఎంటర్‌టైన్ చేస్తున్నారు.
నిజానికి రాహుల్ డాన్సుల్లో వీక్.. కానీ, పునర్నవి వెళ్లిపోయాకా, డాన్సులు కూడా ఇరగదీసేస్తున్నాడు. లేటెస్ట్ వీకెండ్ ఎపిసోడ్‌లో 'నేనే ముఠా మేస్తిరీ..' సాంగ్‌కి స్టెప్పులిరగదీశాడు రాహుల్. రాహుల్ అటెంప్ట్‌కి హోస్ట్ నాగార్జున మెచ్చుకున్నారు. ఆ సందర్భంలోనే 'తిట్టేవాళ్లు లేకుంటే, టాలెంట్ ఇలా బయటికొస్తుందన్న మాట..' అని నాగ్ పునర్నవిని ఉద్దేశించి ప్రస్థావించారు. ఇక ఈ వీకెండ్ ఎపిసోడ్‌లో హౌస్ మేట్స్ అంతా తమ తమ డాన్సింగ్ టాలెంట్‌తో ఆడియన్స్‌ని విశేషంగా ఆకట్టుకున్నారు.