మాస్ మహరాజ్ రవితేజ ఈజ్ బ్యాక్. రవితేజని ఎలా చూడాలని అతని అభిమానులు అనుకుంటారో, అలాంటి స్టైలిష్ అండ్ ఎనర్జిటిక్ రోల్లో రవితేజని దర్శకుడు విఐ ఆనంద్ 'డిస్కో రాజా'లో చూపించే ప్రయత్నం చేస్తున్నట్లే కన్పిస్తోంది. తాజాగా విడుదలైన 'డిస్కో రాజా' టీజర్ చూస్తే ఈ అభిప్రాయంతో ప్రతి ఒక్కరూ ఏకీభవించాల్సిందే. లిక్కర్ వున్న గ్లాస్‌ని స్టైలిష్‌గా తిప్పుతూ, చేతిలో సిగార్ని పట్టుకోవడం దగ్గర్నుంచి.. విలన్ గ్యాంగ్ తన మీద గన్స్ ఎయిమ్ చేస్తే, వాటిని తెలివిగా వాళ్ళ వైపే తిప్పే సన్నివేశం వరకూ.. 'డిస్కో రాజా' టీజర్ మాస్ మహరాజ్ అభిమానులకి ఓ రేంజ్లో కిక్ ఇస్తుందని నిస్సందేహంగా చెప్పొచ్చు. చనిపోయిన వ్యక్తిని బతికించడం.. అనే కాన్సెప్ట్ టీజర్లో కన్పిస్తోంది.
ఈ ప్రయోగానికి రవితేజని ఓ మెడికల్ మాఫియా ఎంచుకుందా.? లేదంటే, ఏదన్నా మంచి ఉద్దేశ్యంతో ఇంకెవరైనా ఆ పని చేస్తున్నారా.? అన్నది సినిమా చూస్తేనే తెలుస్తుంది. టీజర్లో మాత్రం మెయిన్ హీరోయిన్లు పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్ కన్పించలేదు. ఈ సినిమాలో నటిస్తోన్న మరో బ్యూటీ తాన్యా హోప్ మాత్రం కన్పించింది. అంటార్కిటికా మంచుని బ్యాక్‌డ్రాప్‌గా చేసుకున్న సీన్స్, ఆ మంచులోంచి యాక్షన్ స్టంట్.. టీజర్లో హైలైట్‌గా నిలిచాయి. ఓవరాల్‌గా 'డిస్కో రాజా' టీజర్ చాలా ఇంట్రెస్టింగ్గా మలచబడిందని చెప్పొచ్చు.