భార్యను వేధిస్తున్నాడన్న ఆరోపణలపై ఇటీవల అరెస్టైన నటుడు సామ్రాట్ బెయిల్‌పై విడుదలయ్యారు. వరకట్నం విషయంలో తనను వేధిస్తున్నాడనీ, మెంటల్‌గా, ఫిజికల్‌గా తనను చిత్రహింసలు పెడ్తున్నాడంటూ సామ్రాట్ భార్య హర్షితా రెడ్డి ఇటీవల ఆయనపై ఆరోపణలు చేసింది. దాంతో పోలీసులు సామ్రాట్‌ని అరెస్టు చేశారు.
అంతేకాదు సామ్రాట్‌పై డ్రగ్స్ ఆరోపణలు కూడా చేసింది హర్షితా రెడ్డి. అయితే ఇటీవల టాలీవుడ్‌లో పలువురు సినీ సెలబ్రిటీస్ డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. వారిలో పలువురు యంగ్ హీరోలు కూడా ఉన్నారు. ఈ కేసులో ఎవరైతే అనుమానితులుగా ఉన్నారో వారంతా విచారణలకు కూడా హాజరయ్యారు. అయితే వారిలో ఎక్కడా సామ్రాట్ పేరు వినిపించలేదు. ఇదే విషయాన్ని ప్రస్థావిస్తూ, సామ్రాట్ డ్రగ్స్ ఆరోపణల్ని ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నాననీ, ఎలాంటి విచారణకైనా రెడీ అనీ అంటున్నాడు.
అంతేకాదు డ్రగ్స్ ఒకసారి తీసుకుంటే, వాటి అవశేషాలు శరీరం నుండి అంత సులువుగా బయటికి పోవు. కాబట్టి, తనకు ఈ విషయమై ఎలాంటి టెస్ట్‌లైనా చేయొచ్చనీ, అందుకు తాను సంసిద్ధంగా ఉన్నాననీ, అంటున్నాడు సామ్రాట్. అవును ఇది వెరీ వెరీ నోటెడ్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్. ఇక అమ్మాయిల విషయంలో కూడా సామ్రాట్‌పై ఎలాంటి రీమార్క్స్ లేవని తెలుస్తోంది. ఆయనతో కలిసి నటించిన ఇతర నటీనటులను విచారంచగా ఆ విషయం ప్రూవ్ అయ్యింది.
మరి ఎందుకు అనవసరంగా సామ్రాట్‌పై స్వయంగా తన భార్యే ఇలాంటి ఆరోపణలు చేస్తోంది. అసలింతకీ సామ్రాట్ ఈ తప్పు చేశాడా? లేక అమాయకుడా? అనే నిజం నిలకడ మీద తేలాల్సి వుంది. ప్రస్తుతానికి అయితే సామ్రాట్‌కి బెయిల్ వచ్చింది. విడుదలయ్యాడు. అయితే ఈ కేసు ఎంతవరకూ వెళుతుందనేది చూడాలి మరి.