సంపూర్ణేష్‌ బాబా.. మజాకానా.!

మరిన్ని వార్తలు

గతంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదా విషయంలో వైజాగ్‌లో యూత్‌ చేపట్టిన ఉద్యమంలో పాల్గొని, అందరికీ షాక్‌ ఇచ్చాడు బర్నింగ్‌ స్టార్‌ సంపూర్ణేష్‌ బాబు. తెలంగాణ వాడైనా ఆంధ్రలో తనకు చాలా మంది అభిమానులున్నారనీ, తన ఆంధ్ర తమ్ముళ్లు కష్టాల్లో ఉంటే తాను చూడలేనని భావించి, అప్పుడా ఉద్యమంలో పాల్గొని, అరెస్టయ్యాడు కూడా సంపూర్ణేష్‌బాబు. 

ఆ ఉదంతంతో సంపూర్ణేష్‌ బాబు రీల్‌ హీరో మాత్రమే కాదు, రియల్‌ హీరో అనిపించుకున్నాడు. ఇప్పుడు మళ్లీ ఆంధ్రప్రదేశ్‌ స్పెషల్‌ స్టేటస్‌ ఇష్యూ రైజ్‌ అయ్యింది. అందుకే అప్పటి సంపూర్ణేష్‌ బాబు అరెస్ట్‌ ఫోటోలను పోస్ట్‌ చేస్తూ సంపూర్ణేష్‌ బాబు మరోసారి సోషల్‌ మీడియాలో సందడి చేశాడు. ప్రత్యేక హోదా కోసం తన ఆంధ్రా తమ్ముళ్లు చేపడుతున్న ప్రతీ కార్యక్రమానికి తాను మద్దతు తెలుపుతాననీ, ప్రత్యేకంగా స్పెషల్‌ స్టేటస్‌ విషయంలో మనకు (ఆంధ్రా తమ్ముళ్లు) జరుగుతున్న అన్యాయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాననీ, సంపూర్ణేష్‌ బాబు అన్నారు.

 

రాజకీయ పార్టీలకతీతంగా ఈ పోరాటంలో ఎవరు పిలిచినా వచ్చి, తన వంతు సాయం అందిస్తాననీ సంపూర్ణేష్‌ బాబు అన్నారు. సంపూర్ణేష్‌కి యూత్‌లో బాగా క్రేజ్‌ ఉన్న సంగతి తెలిసిందే. అంతేకాదు, ఏదో తెలియని ఎట్రాక్షన్‌ కూడా ఉంది సంపూర్ణేష్‌ బాబులో. ఆ ఎట్రాక్షన్‌ సినిమాలకే కాదు, స్పెషల్‌ స్టేటస్‌ విషయంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి కూడా కలిసొస్తుందేమో చూడాలి మరి. ఏది ఏమైనా అభిమానుల కోసం ప్రాంతీయ బేధాన్ని పక్కన పెట్టి, ఇన్‌ టైంలో స్పందించి, సంపూర్ణేష్‌బాబు నిజంగా రియల్‌ హీరో అనిపించుకున్నాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS