అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా 'దువ్వాడ జగన్నాధమ్' ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ యూ ట్యూబ్‌లో సంచలనాలు సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 90 లక్షల వ్యూస్ దాటేశాడు ఈ సినిమాతో అల్లు అర్జున్. అయితే మరో పక్క పవన్ కళ్యాణ్ సినిమా 'కాటమరాయుడు' సంచలనాల సంగతి చెప్పనే అక్కర్లేదు. 'కాటమరాయుడు' ఇప్పటికే కోటిని క్రాస్ చేసేశాడు. అల్లు అర్జున్ 'డీజె', పవన్ కళ్యాణ్ 'కాటమరాయుడు'కి పోటీగా యూ ట్యూబ్ సంచలనాలు క్రియేట్ చేస్తోంది. 'కాటమరాయుడు' కోటీ 10 లక్షల దిశగా దూసుకెళుతుండగా, అల్లు అర్జున 90 లక్షలు దాటాక అల్లు అర్జున్ 'డిజె' యూ ట్యూబ్ వ్యూస్ పరంగా వేగం తగ్గింది. అయినప్పటికీ పవన్‌కల్యాణ్‌కి గట్టి పోటీ ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే అల్లు అర్జున్‌కి మల్లూవుడ్‌లో అభిమానులు ఎక్కువ. మలయాళంలో ఉన్న క్రేజ్‌తోనే బన్నీ పవర్ స్టార్‌కి ఈ రకమైన పోటీ ఇవ్వగలుగుతున్నాడంటున్నారు. బన్నీ లిస్టులో ఆ అభిమానులు యూ ట్యూబ్ వ్యూస్‌కి అదనంగా యాడ్ అయ్యారు. ఏది ఏమైనా ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి హరీష్ శంకర్ దర్శత్వంలో తెరకెక్కుతోంది ఈ సినిమా. హరీష్ శంకర్‌కి ప్రేక్షకుల నాడి బాగా తెలుసు. మాస్ పల్స్ అయినా, క్లాస్ పల్స్ అయినా కరెక్ట్‌గా పట్టగలిగే టాలెంట్ ఉన్న డైరెక్టర్. సో ఈ సారి బన్నీ, పవన్ కళ్యాణ్‌కి గట్టి పోటీ ఇచ్చేలానే ఉన్నాడు.