హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు రకాల పాత్రలు పోషించిన మోహన్‌బాబు చాలా కాలం తర్వా పూర్తి స్థాయిలో ప్రధాన పాత్ర పోషిస్తున్న సినిమా 'గాయత్రి'. గాయత్రి అంటే పేరుకు తగ్గట్లుగా ఇదేదో మామూలు సినిమా అనుకునేరు. కానీ కానే కాదు. డిఫరెంట్ జోనర్‌లో తెరకెక్కుతోన్న చిత్రమిది.
ఇంతకు ముందెన్నడూ ఈ తరహా స్టోరీలో సినిమా వచ్చింది లేదట. అంత కొత్తగా ఉండబోతోందట సినిమాలో కథా, కథనం. ముఖ్యంగా మోహన్‌బాబు పర్‌ఫామెన్స్ న భూతో న భవిష్యతి అనే రేంజ్‌లో ఉండబోతోందట. మోహన్‌బాబు అంటే గుర్తొచ్చేది తూటాల్లాంటి మాటలు. ఆకట్టుకునే డైలాగులు. మోహన్‌బాబు నోట పలికే ఆ మాటలు చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉండబోతున్నాయట 'గాయత్రి' సినిమాలో. తండ్రీ కూతుళ్ల ఎమోషనల్ డ్రామా ఈ సినిమాలో కీలకమైన పార్ట్. కాగా ప్రస్తుతం సమాజంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలు, అరాచకాలపై మోహన్‌బాబు సంధించే అస్త్రంగా ఈ సినిమా ఉండబోతోందట.
పోస్టర్స్‌లో మోహన్‌బాబు డిఫరెంట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కనిపిస్తున్నారు. ఆ ఎక్స్‌ప్రెషన్స్ సినిమాపై ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేస్తున్నాయి. ట్రైలర్ వచ్చాక సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. కాస్టింగ్ పరంగా కూడా ఈ సినిమాలో భారీతనం కనిపిస్తోంది. మంచు విష్ణు, శ్రియ, నిఖిలా విమల్, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రతీ పాత్రకీ ఓ ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ ఉంటుందట సినిమాలో. ప్రతీ క్యారెక్టర్ ఆడియన్స్ మదిలో ఓ ప్రత్యేకమైన గుర్తింపు పొందుతుందనీ అంటున్నారు.
ఆషామాషీగా ఈ సినిమాని ఒప్పుకోలేదట మోహన్‌బాబు. ఓ మంచి ఆలోచనతోనే ఈ సినిమాకి ఆయన సైన్ చేశారట. ఇక రిజల్ట్ సంగతెలా ఉండబోతోందనేది త్వరలోనే తెలియనుంది. ఫిబ్రవరిలో 'గాయత్రి' ప్రేక్షకుల ముందుకు రానుంది.