'సూయ సూయ..' అంటూ సాగే పాట. తాజాగా యూ ట్యూబ్‌లో వినిపిస్తోంది. విడుదలైన కాస్పేపటికే వైరల్ అయ్యింది. సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతోన్న 'విన్నర్' సినిమాలోనిది. ఈ పాటకి ప్రముఖ యాంకర్ సుమ తన గొంతునివ్వగా, మరో ప్రముఖ యాంకర్ అనసూయ ఆడి పాడింది. చాలా తక్కువ సినిమాలే చేసినా, అనసూయకి విపరీతంగా ఫాలోయింగ్ ఉంది. ఆంటీ అయినా కానీ అనసూయ లెక్కే వేరు. ఆ ఫాలోయింగ్‌తోనే అనసూయ ఐటెం సాంగ్ అంటే జనం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాలో నాగార్జునతో కలసి ఓ పాటలో ముగ్గురు ముద్దుగుమ్మలు చిందేశారు. హంసానందిని, దీక్షా పంత్, అనసూయ.. అయినా కానీ ఆ పాటలో ఎక్కువ ఫోకస్ అనసూయ మీదే ఉండడం విశేషం. అలాగే తాజా సాంగ్‌కి సంబంధించి కూడా ట్రైలర్‌లో అనసూయ మూమెంట్స్ అంతగా కనిపించకపోయినా, కానీ అనసూయ ఫాలోయింగ్‌కీ, సాయి ధరమ్ తేజ్ స్టార్‌డమ్‌కీ ఈ సాంగ్‌ని టాప్ చార్ట్‌లోకి తీసుకెళ్లేలా చేసింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. తొలిసారిగా ఈ చిత్రంతో యాంకర్ సుమ సింగర్ అవతారమెత్తింది. స్టార్టింగ్ సాంగ్‌తోనే అదరగొట్టేస్తోంది. సాయి ధరమ్ తేజ్‌కి జంటగా ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. శివరాత్రి సందర్భంగా ఈ సినిమా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.