అర్జున్ రెడ్డి చిత్రంతో రాత్రికి రాత్రే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న హీరో విజయ్ దేవరకొండ. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో యంగ్ హీరోలందరిలోనూ ముందు వరుసలో ఉన్నాడు.
ఇక విజయ్ తనకి వచ్చిన ఇమేజ్ తో తన ఇంటి నుండే మరో హీరోని ఇండస్ట్రీ కి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడన్న వార్తలు ఇప్పుడు ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఆ వార్తల సారాంశం ప్రకారం- విజయ్ సొంత తమ్ముడు ఆనంద్ ని హీరోగా తెలుగు తెరకి పరిచయం చేయనున్నాడట విజయ్.
ఇందుకోసమే ఆనంద్ కి నటనలో శిక్షణతో పాటుగా ఒక మంచి హీరోకి ఉండాల్సిన లక్షణాలు వచ్చేలాట్రైనింగ్ ఇప్పిస్తున్నాడట. ఇక విజయ్ కి బాగా తెలిసిన ఒక నిర్మాణ సంస్థ ఆనంద్ ని పరిచయం చేసే పనిలో ఉన్నట్టుగా కూడా సమాచారం.
ఇదే గనుక నిజమైతే.. విజయ్ మంచి తెలివైనవాడే అని అనక తప్పదు.