సంచలనాలకి కేర్ అఫ్ అడ్రస్ గా మారిన శ్రీ రెడ్డి చూపు ఇప్పుడు జబర్దస్త్ కమెడియన్ అయిన హైపర్ ఆది పైన పడినట్టుంది. తాజాగా ఆది ని టార్గెట్ చేస్తూ అంతర్జాలంలో విరుచుకుపడింది శ్రీ రెడ్డి.
వివరాల్లోకి వెళితే, జబర్దస్త్ లోని ఒక స్కిట్ లో శ్రీ రెడ్డి ని ఉద్దేశ్యించి చేసిన పరోక్ష కామెంట్ పైన ఆమె తీవ్రంగా అభ్యంతరం తెలిపింది. తాను ఇండస్ట్రీ లో జరుగుతున్న వాటికి నిరసన తెలిపే క్రమంలో చేసిన పనిని ఒక కామెడీ గా చూపిస్తూ సెటైర్లు వేయడం సరికాదు అని చెప్పింది.
అలాగే ఆడవారి పైన కూడా కామెంట్స్ చేయడం మంచిది కాదు అని, భవిష్యత్తులో ఇదే గనుక జరిగితే ఎదురుగా వచ్చి కొట్టడానికి కూడా వెనుకాడను అని హెచ్చరించింది. తన పైన గనుక ఇంకొకసారి కామెంట్స్ చేస్తే తాట తీస్తా అంటూ తీవ్రస్థాయిలో కామెంట్స్ విసిరింది.
మరి దీనికి హైపర్ ఆది ఎలా స్పందిస్తాడో చూడాలి.