'భరత్ అనే నేను' సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుక రాబోతోంది. సూపర్ స్టార్ మహేష్ సినిమా అంటే ఆ కిక్కే ఓ రేంజ్‌లో వుంటుంది. పైగా, ఈ సినిమాకి కొరటాల శివ దర్శకుడాయె. 'శ్రీమంతుడు' కాంబినేషన్ రిపీట్ అవుతోందంటే, ఆ సినిమాపై అంచనాలు ఎలా వుంటాయో ఊహించుకోవడం కష్టమే.
అంచనాల్ని మించిన అంచనాలంటే ఎలా వుంటాయో, అచ్చంగా 'భరత్ అను నేను' సినిమా మేనియా చూస్తే అర్థమవుతుంది. ఒక్కో పాటా బయటకొస్తోంటే, మహేష్ అభిమానులు పూనకంతో ఊగిపోతున్నారు. ఓ స్టిల్ వచ్చిందంటే చాలు, అభిమానుల ఆనందానికి ఆకాశమే హద్దుగా మారిపోతోంది. 'ఇంతకు ముందెప్పుడూ లేదు, ఇకపై ఇంకెంతలా వుంటుందో లేదో చెప్పలేం..' అనే స్థాయిలో మహేష్ 'భరత్ అనే నేను' సినిమాతో ఓ ట్రెండ్ సృష్టించేసేలానే వున్నాడు. రేపు హైద్రాబాద్‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగబోతోంది. దీనికి 'బహిరంగ సభ' అనే పేరు పెట్టేశారు.
ఇదేదో పొలిటికల్ పార్టీ హడావిడి అనుకునేరు.. అంతకు మించి.. అనే స్థాయిలో ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగబోతోందట. మరోపక్క, నిన్ననే సినిమాకి సంబంధించి 'వచ్చాడయ్యో..' అనే సాంగ్ విడుదల చేశారు. క్షణాల్లో ఈ సాంగ్ వైరల్ అయిపోయింది. ట్రెండింగ్స్‌లో దూసుకుపోతోంది. ఇప్పుడే ఇలా వుంటే, సినిమా రిలీజ్‌కి పరిస్థితి ఇంకెలా వుంటుందట.? తెలుగు సినీ పరిశ్రమలోనే ఇంతకు ముందెన్నడూ ఏ సినిమాకీ లేనంత హైప్ 'భరత్ అనే నేను' దక్కించుకుంటుంంటే ఆషామాషీ విషయం కాదిది.
ఫస్ట్ డే, ఫస్ట్ వీక్ రికార్డులు ఆల్రెడీ 'భరత్ అనే నేను' పేరిట రిజర్వ్ అయిపోయాయని అనుకోవచ్చేమో.