సెకండ్ ఇన్నింగ్స్‌లో సీనియర్ ముద్దుగుమ్మలు తమ తడాఖా చూపిస్తున్నారు. ఈ కోవలో తాజాగా 'ఎంసీఏ' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ముద్దుగుమ్మ భూమిక గురించి మాట్లాడుకోవాలి. పెళ్లి చేసుకుంది. తల్లయ్యింది. అయినా కానీ ఫిజిక్‌లో ఏమాత్రం మార్పు రాలేదు. ఇప్పటి హీరోయిన్స్‌కి ఏమాత్రం తీసిపోదన్నట్లుగా ఉంది భూమికలో గ్లామర్. అందుకే 'ఎంసీఏ' చిత్రం తర్వాత అంతా భూమికని హీరోయిన్‌గా ఛాన్సొస్తే నటిస్తారా? అని అడుగుతున్నారు.
అందుకు భూమిక ఏమీ నో అనలేదు. ఛాన్సొస్తే చేస్తానన్నట్లే చెప్పింది. అయితే ఛాన్సులొస్తాయా..? అనేదే ప్రశ్న. హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలకు అయితే సై అంటోంది. అయితే పాత్ర, కథ తనకి బాగా నచ్చితేనే అంటోంది. అలాగే చిన్న క్యారెక్టర్ అయినా చేయడానికి సిద్ధమే కానీ, తన పాత్ర కథని మలుపు తిప్పేలా ఉండాలంటోంది. మొత్తానికి భూమిక సెకండ్ ఇన్నింగ్స్‌ని బాగానే ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 'సవ్యసాచి' సినిమాలో నటిస్తోంది. నాగచైతన్య హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో హీరోకి అక్క పాత్రలో కనిపించనుంది భూమిక. పాత్ర సన్నివేశాలు చాలా తక్కువే అయినప్పటికీ, ఆ పాత్ర సినిమాకి చాలా కీలకంగా ఉండబోతోందట.
గతంలో 'అనసూయ' తదితర హీరోయిన్ సెంట్రిక్ మూవీలో నటించి, విజయం సాధించింది భూమిక. ఇప్పుడు కూడా ఆలాంటి స్టోరీలేమైనా తన వద్దకు వస్తే కాదననంటోంది. అయితే థ్రిల్లర్స్ అయితే ఓకే కానీ, హారర్ జోలికి మాత్రం పోనంటోంది ముద్దుగుమ్మ భూమిక.