మెగా ముహూర్తం ఎప్పుడు?

మరిన్ని వార్తలు

చరణ్‌ - సుకుమార్‌ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా ప్రారంభత్సవం అయిపోయింది. ఈ సినిమా కోసం రామ్‌ చరణ్‌ న్యూ లుక్‌ ట్రై చేయనున్నాడు. పూర్తిగా పల్లెటూరి వాతావరణంలో ఈ సినిమా తెరకెక్కబోతోంది. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ స్టోరీ అని గాసిప్స్‌ వినిపిస్తున్నాయి. తొలి సారిగా ఈ సినిమాతో సమంత, చరణ్‌తో జత కడుతోంది. అయితే సమంతది ఈ సినిమాలో ఫుల్‌ లెంగ్త్‌ హీరోయిన్‌ రోలా? లేక గెస్ట్‌ రోలా అనేది తెలాయాల్సి ఉంది. మరో ముద్దుగుమ్మ రాశీఖన్నా కూడా ఈ సినిమాలో నటిస్తోంది. ఇదంతా చరణ్‌ సినిమా సంగతి. 150వ సినిమాతో రికార్డులు తిరగ రాశాడు మెగాస్టార్‌ చిరంజీవి. ఇక చిరంజీవి 151వ సినిమా స్టార్ట్‌ కావాల్సి ఉంది. ఈ సినిమాను సెట్స్‌ మీదికి తీసుకెళ్లేందుకు మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్తోంది చిత్ర యూనిట్‌. రామ్‌ చరణ్‌ నిర్మాణంలో సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ముద్దుగుమ్మ అనుష్కని ఈ సినిమాలో హీరోయిన్‌గా పరిశీలిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమాకి సురేందర్‌ రెడ్డి ఓ కథని ప్రిపేర్‌ చేయగా, ఆ కథని ప్రస్తుతం పరిశీలనలో ఉంచినట్లు తెలుస్తోంది. చిరంజీవి డ్రీమ్‌ ప్రాజెక్టు అయిన 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' సినిమాని తెర మీదికి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకి స్టోరీని ప్రిపేర్‌ చేసే పనిలో నిమగ్నమయ్యారు ప్రముఖ రచయితలు పరుచూరి బ్రదర్స్‌. అయితే ఈ స్టోరీనే సురేందర్‌ రెడ్డి డైరెక్ట్‌ చేస్తాడా? లేక ఇంకేదైనానా? అసలు సూరి డైరెక్షన్‌లో వచ్చే మూవీ ఏంటా అనేది ప్రస్తుతానికి అయితే సస్పెన్సే. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS