గత యాడాది సరైనోడుగా అభిమానులను అలరించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు 'దువ్వాడ జగన్నాథమ్'(డీజే)గా వస్తున్నాడు. అల్లు అర్జున్ -హరీశ్ శంకర్ కలయికలో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజగా ఈ సినిమా ఫస్ట్ కు బయటికి వచ్చింది. ఈ లుక్ చూశాక ఒక విషయం పక్కా అయిపోయింది. డీజే.. ఎన్టీఆర్ 'అదుర్స్'కి సీక్వెల్ ని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఫస్ట్ లుక్ చూసిన తర్వాత దిన్ని పక్కా చేసుకోవచ్చు.
డైరెక్టర్ కాకముందు హరీష్ శంకర్ రచయిత. ఆయన రాసిన స్క్రిప్ట్ ల్లో అదుర్స్ ఒకటి. ఇందులో ఎన్టీఆర్ బ్రాహ్మిన్ పాత్ర (చారి) ఆదరగొట్టింది. ఈ పాత్రను సృష్టించింది హరీష్ శంకరే. ఈ పాత్రకు కొనసాగిపుంగా మరో పాత్ర కూడా సృస్టించాడు హరీష్. దాన్ని ఎన్టీఆర్ కు వినిపించాడు. అదుర్స్ 2గా తీద్దామని అనుకున్నాడు. కాని ఎందుకో కుదరలేదు. ఇప్పుడీ పాత్రలోనే అల్లు అర్జున్ ను చూపించబోతున్నాడన్న సంగతి డీజే ఫస్ట్ లుక్ చూస్తే అర్ధమైపోయింది. సేమ్ చారి గెటప్ లో కనిపించాడు బన్నీ. అయితే చిన్న తేడా ఆ సినిమాలో ఎన్టీఆర్ కి నిలువు బొట్టు ఉటుంది ఇందులో అడ్డంగా బొట్టు తగిలించారు. అదుర్స్ సినిమాకి మెయిన్ హైలెట్ చారి పాత్రే. ఇప్పుడు దాన్ని కొనసాగింపుగా డీజే పాత్రను క్రియేట్ చేశాడు హరీష్. దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రమిది. పూజ హెగ్డే హీరోయిన్. వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి చారి పాత్రకు కొనసాగింపుగా వస్తున్న డిజే 'అదుర్స్' అనిపిస్తుందో లేదో చూడాలి.