సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడింది జీవిత. శ్రీరెడ్డి ఇష్యూపై ప్రెస్ మీట్ పెట్టి, ఇండస్ట్రీ తరపున మాట్లాడిన మొట్ట మొదటి మహిళ జీవితా రాజశేఖర్. ఆమెకు ప్రతీ ఒక్కరూ అండగా నిలవాలి. ఇండస్ట్రీలో మహిళలపై కాస్టింగ్ కౌచ్ లేదని ఆమె అనడం లేదు. కానీ మొత్తం పరిశ్రమ అంతా అలాంటిదే అనేది భావ్యం కాదని ఆమె వాదిస్తోంది.
ఎంతో మంది ఇండస్ట్రీ నుండి స్టార్స్‌గా ఎదిగారు. హీరోలు కావచ్చు, మరే ఇతర సినీ ప్రముఖులైనీ కావచ్చు, మగాళ్లు ఎవరైనా ఈ అంశంపై స్పందిస్తే అది మరోలా ఉంటుంది. అందుకే సినీ పరిశ్రమ నుండి మహిళలే స్పందించాలి. సీనియర్ దర్శకురాలు విజయనిర్మల, నిర్మాత మంజుల, మరో నటి, నిర్మాత మంచు లక్ష్మీ ప్రసన్న, మాజీ ఎమ్యెల్యే జయసుధ, ప్రస్తుత ఎమ్మెల్యే, నటి రోజా ఇలా పలువురు డైనమిక్ మహిళలు సినీ రంగంలో చక్రం తిప్పిన వారున్నారు.
వీరంతా ఏకతాటిపై నిలబడి, ఈ సమస్యపై స్పందించాల్సిన ఆవశ్యకత ఉంది. శ్రీరెడ్డి అనే అమ్మాయికి ఎందుకు ఛానెల్స్ అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఆమె పేరు చెప్పి, ఆయా ఛానెల్స్ తమ టీఆర్‌పీ రేటింగ్స్ పెంచుకుంటున్నాయి. ఈ ఇష్యూపై డిబేట్స్, డిస్కషన్స్ పెట్టి శ్రీరెడ్డికి ఫ్రీ పబ్లిసిటీ తెస్తున్నారు అని జీవితా రాజశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెకు నిజంగా అన్యాయం జరిగితే రకరకాల పద్ధతులున్నాయి న్యాయం జరిగేందుకు.
అంతేకానీ, ఈ రకంగా ఇండస్ట్రీ ఇండస్ట్రీ అని మాట్లాడడం సబబు కాదనీ జీవితా రాజశేఖర్ అన్నారు. ఈ క్రమంలో తనపై అసభ్యకరమైన ఆరోపణలు చేసిన సోషల్ యాక్టివిస్ట్ సంధ్యపై జీవితా రాజశేఖర్ పోలీసులకు పిర్యాదు చేశారు