'ఇంకెన్నాళ్లు వెయిట్ చేయాలిరా..? అని ఓ జబర్దస్ట్ కమెడియన్ అంటే, ఓ చిన్న పిల్లాడు 'నాని అన్నా..' అంటూ పరుగెత్తుకుంటూ రావడం, నాని ఎంట్రీ ఇవ్వడం. బాబాయ్ ఇప్పుడు ఇంకొంచెం మసాలా.. ఏదైనా జరగొచ్చు..' అనే డైలాగ్ చెప్పడం..' అంతే, బిగ్‌బాస్ చైర్ నాని సొంతమైపోయింది.
గతేడాది ఎన్టీఆర్ హోస్ట్‌గా మొదలైన బుల్లితెర మెగా గేమ్ షో 'బిగ్‌బాస్' టీఆర్‌పీ రేటింగ్స్‌ని ఓ రేంజ్‌లో పెంచేసిన సంగతి తెలిసిందే. ఏకంగా 72 రోజుల పాటు ఈ గేమ్ షో ద్వారా ఎన్టీఆర్ బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరైపోయాడు. తనదైన శైలిలో ఎంటర్‌టైన్ చేశాడు. ఇప్పుడు 'బిగ్‌బాస్' సెకండ్ సీజన్‌కి టైమొచ్చింది. గత కొంతకాలంగా బిగ్‌బాస్‌కి హోస్ట్‌గా వ్యవహరించేదెవరు? అనే విషయంపై పలు రకాల గాసిప్స్ వస్తున్నాయి.
ఎట్టకేలకు ఫిక్స్ అయిపోయింది, ఆ ప్లేస్ నానిదేనని. లేటెస్టుగా నాని బిగ్‌బాస్ 2 హోస్ట్‌గా ఓ వీడియోని రిలీజ్ చేశారు. వీడియోతోనే భారీ అంచనాలు నమోదయ్యేలా చేసింది బిగ్‌బాస్ యూనిట్. ఈ వీడియోలోనే ఇప్పుడు ఇంకొంచెం మసాలా ఏదైనా జరగొచ్చునంటున్నాడు నాని.
త్వరలోనే ఇక 'బిగ్‌బాస్ 2' ద్వారా నాని బుల్లితెరపై మీ ఇంట్లోకి, మీ నట్టింట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. నాని హోస్ట్‌గా జస్ట్ ట్రైలర్ ఎంట్రీనే ఇంత ఘనంగా ఉంటే, ఇక అసలు ఎంటర్‌టైన్‌మెంట్ ఇంకెంత ఘనంగా ఉండబోతోందో కదా. లెట్స్ వెయిట్ అండ్ సీ. కమింగ్ సూన్..!