బిగ్ బాస్ తో ఎనలేని క్రేజ్ ని సంపాదించుకున్న నటి హరితేజ. ఇక ఆ తరువాత ఆమె చేతి నిండా ఆఫర్స్ తో బిజీ బిజీ గా దూసుకుపోతున్నది. అయితే ఆమెకి తాజాగా ఒక అవమానం జరిగిందట, దీనికి సంబంధించి ఒక వీడియో పోస్ట్ చేసి ఆ విషయాన్నీ అందరితో పంచుకున్నది.
ఆ వివరాల్లోకి వెళితే, హరితేజ తన కుటుంబసభ్యులతో కలిసి మహానటి సావిత్రి జీవితం పైన తీసిన మహానటి చిత్రానికి వెళ్ళింది. మొదటిభాగం పూర్తయ్యాక, తమ పక్కనే కూర్చుని సినిమా చూస్తున్న వారితో హరితేజ కుటుంబానికి సీట్ల విషయంలో చిన్న ఘర్షణ మొదలై అది చిలికి చిలికి గాలివానలా మారి పెద్ద గొడవగా మారిందట.
ఆ ఘర్షణ జరుగుతున్న సమయంలోనే హరితేజని మీ సినిమా వాళ్ళు ఎవరి పక్కన అయినా కూర్చుంటారు కాని తమలాంటి సామాన్యులకి అది కుదరదు అని ఒకింత చిన్నచూపుతో మాట్లాడడం చేసారట. ఈ మాటకి తాను, తన కుటుంబసభ్యులు చాలా బాధపడ్దాము అని కళ్ళ నిండా నీరుతో బాధపడుతూ ఈ విషయాన్నీ అందరితో చెప్పింది.
దయచేసి సినిమా వాళ్ళని ఇలా చులకనగా మాట్లాడకండి అంటూ తనలోని బాధని తెలియచేసింది.