'బాహుబలి' తర్వాత రాజమౌళి, ఎన్టీఆర్ - చరణ్ కాంబినేషన్‌లో ఓ మల్టీ స్టారర్‌ని తెరకెక్కించబోతున్నాడన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ కన్‌ఫామేషన్ ఏమీ రాలేదు. కథ ఇంకా వినలేదు అని చరణ్ చెప్పాడు. ఎన్టీఆర్ కూడా అలాగే చెప్పాడు. ఈ సినిమాలో చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ బాక్సర్స్‌లా కనిపిస్తారని మొన్నటి వరకూ గాసిప్ వినిపించింది. నిన్నేమో చరణ్ జాకీలా నటిస్తాడని అన్నారు. కాదు చరణ్ పోలీస్ అట.. అని తాజా గాసిప్.
గాసిప్స్ మీద గాసిప్స్ ఇలా ప్రచారమవుతూనే ఉన్నాయి. కానీ అసలు క్లారిటీ రావడం లేదు. అభిమానుల్లో ఉన్న ఈ కన్‌ఫ్యూజన్ తీరాలంటే షిప్ ఆఫ్ ద కెప్టెన్ డైరెక్టర్ రాజమౌళి పెదవి విప్పాల్సిందే. అయితే రాజమౌళి ప్రస్తుతం ప్రపంచ పర్యటనలో బిజీగా ఉన్నాడు. 'బాహుబలి' సక్సెస్ మూడ్ నుండి ఇంకా బయటికి రాలేదు. ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. చరణ్ సంగతి సరేసరి. ఇటీవలే 'రంగస్థలం' సినిమాతో బిగ్గెస్ట్ హిట్ కొట్టి, తెలుగు సినిమా హిస్టరీ తిరగరాసేసి, ఇప్పుడు బోయపాటి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇలా ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉన్నారు.
మరో పక్క ఆడియన్స్‌లో ఉత్సుకత ఆగక, గాసిప్స్ మీద గాసిప్స్ పుట్టుకొస్తున్నాయి. ఆ గాసిప్స్‌తోనే అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే, తాజా సమాచారమ్ ప్రకారం, అతి త్వరలోనే రాజమౌళి అండ్ టీమ్ ఈ మెగా మల్టీ స్టారర్‌కి సంబంధించిన ఓ తాజా అప్‌డేట్ ఇవ్వబోతున్నారనీ తెలుస్తోంది.
సినిమాపై పక్కా క్లారిటీతో పాటు, టైటిల్ లోగో, కాన్సెప్ట్ వివరాలను కూడా రివీల్ చేయనున్నారనీ విశ్వసనీయ వర్గా సమాచారమ్.