ఎన్టీఆర్ హోస్ట్‌గా గతేడాది బుల్లితెరపై ప్రసారమైన 'బిగ్‌బాస్' షో మొదటి సీజన్ ఇప్పుడు నాని హోస్ట్‌గా త్వరలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. నేచురల్ స్టార్‌గా బిగ్ స్క్రీన్‌పై ఇమేజ్ సంపాదించుకున్న నాని, బుల్లితెరపై ఎలా అలరిస్తాడనే అంశంపై ఆడియన్స్‌లో ఆశక్తి నెలకొంది.
అసలే బిగ్‌బాస్ అంటే ఇలా ఉంటుంది అనే మార్క్ వేసేసి వెళ్లిపోయాడు ఎన్టీఆర్. తన స్టార్‌డమ్‌ని పక్కన పెట్టేసి, బిగ్‌బాస్ హోస్ట్‌గా జనం మనసులో ప్రత్యేకమైన ముద్ర వేసేశాడు ఎన్టీఆర్. బిగ్‌బాస్ షో కంప్లీట్ అయిపోయి ఇంత కాలం గడిచినా, ఆ ఫ్లేవర్‌ని జనం ఇంకా మర్చిపోలేదు. మర్చిపోలేరు కూడా. దాంతో ఇప్పుడు నాని ఎంత చేసినా ఎన్టీఆర్‌తో పోల్చుకుని, తప్పులు వెతికి పెట్టే ప్రయత్నం చేయడం సహజం. సో బిగ్‌బాస్ షోని ఎన్టీఆర్ స్థాయిలో హ్యండిల్ చేయడమనేది నానికి ఒకింత కత్తిమీద సామే అని చెప్పాలి.
వెరీ వెరీ క్రిటికల్ టాస్క్. సినిమాల పరంగా మాస్‌లో మంచి ఇమేజ్ ఉంది నానికి. కానీ ఆ అనుభవం బుల్లితెరపై ఎంతవరకూ పనికొస్తుందో చూడాలంటే మరి కొద్ది రోజులు మాత్రమే వెయిట్ చేయాలి. తనకున్న మాస్ ఇమేజ్‌కి తగ్గట్లుగానే ప్రోమో వీడియోలను ప్రిపేర్ చేసి, 'ఈ సారి ఇంకొంచెం మసాలా..' అంటూ నాని చేత చెప్పించడం బాగానే ఉంది. కానీ మసాలా అంటే..? అని తిరిగి క్వశ్చన్ చేస్తున్నాడు ఆడియన్స్.
మొదటి సీజన్ 72 రోజుల పాటు కొనసాగితే, ఇప్పుడు 100 రోజులు కంటిన్యూస్‌గా కొనసాగనుంది. అప్పుడు 14 మంది పార్టిసిపెంట్సే కానీ, ఇప్పుడు 16 మంది పార్టిసిపెంట్స్. ఈ సారి ఓన్లీ సెలబ్రిటీసే కాకుండా, కామన్ పీపుల్‌కి కూడా ఛాన్స్ ఇచ్చారనీ తెలుస్తోంది. ఎక్స్‌ట్రా మసాలాతో ఎక్స్‌ట్రా ఎంటర్‌టైన్‌మెంట్‌తో 'బిగ్‌బాస్ 2' జూన్ 10 నుండి బుల్లితెరపై సందడి చేయనుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ.!