మెగా మేనల్లుడికి ఆ లోటు తీరనుందా?

మరిన్ని వార్తలు

మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'తేజ్‌ ఐ లవ్‌యూ'. జూన్‌ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కూల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంపైనే తేజు గంపెడు ఆశలు పెట్టుకున్నాడు. 

ఈ మధ్య తేజు నటించిన చిత్రాలన్నీ భారీగా నిరాశపరుస్తున్నాయి. ఎంత టైమ్‌ బ్యాడ్‌ కాకపోతే, మెగా డైరెక్టర్‌ వినాయక్‌తో చేసిన 'ఇంటెలిజెంట్‌' మూవీ కూడా తేజుని నిరాశపరుస్తుంది. అందుకే ఏదో రూపంలో తేజుకి లక్కు కలిసి రావాలి ఈ సినిమాకి. అనుపమా పరమేశ్వరన్‌ రూపంలో ఆ లక్కు చిక్కుతుందేమో అని భావిస్తున్నారు. అంతేకాదు, రొమాంటిక్‌ చిత్రాల దర్శకుడిగా మంచి బ్యాక్‌ గ్రౌండ్‌ ఉన్న డైరెక్టర్‌ కరుణాకరన్‌ వైపు నుండి కూడా అంచనాలు బాగున్నాయి. చిన్న మామయ్య పవన్‌ కళ్యాణ్‌తో 'తొలిప్రేమ' వంటి సూపర్‌ డూపర్‌ హిట్‌ కొట్టిన ట్రాక్‌ రికార్డుంది డైరెక్టర్‌ కరుణాకరన్‌కి. 

చూడాలి మరి ఆ తర్వాత ఇన్నాళ్లకు ఆ స్థాయిలో కరుణాకర్‌ నుండి వస్తున్న రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా 'తేజ్‌ ఐ లవ్‌యూ'ని అభివర్ణిస్తున్నారు. ఒకవేళ ఈ సినిమాతోనే తేజుకి దశ తిరగనుందేమో చూడాలి మరి. ఆల్రెడీ రిలీజైన టీజర్‌తో రొమాంటిక్‌ ప్రియుల్ని విశేషంగా ఆకట్టుకున్నాడు తేజు. ఇక అనుపమా - తేజు పెయిర్‌ కూడా చాలా క్యూట్‌గా కనిపిస్తోంది. ప్రీ రిలీజ్‌ బజ్‌ బాగుండడంతో ఈ సినిమాకి బిజినెస్‌ కూడా బాగా జరిగిందనే టాక్‌ వినిపిస్తోంది. 

చూడాలిక 'తేజ్‌ ఐ లవ్‌యూ' అని ఆడియన్స్‌ చేత అనిపించుకుంటాడో లేదో.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS