ఈ సారి ఎంటర్‌టైన్‌మెంట్‌ డబుల్‌ ధమాకా.!

మరిన్ని వార్తలు

నాని సినిమా వస్తుందంటే చాలు పిల్లా పెద్దా అందరికీ పండగే. ముఖ్యంగా పిల్లల హీరోగానూ, ఫ్యామిలీ హీరోగానూ నానికి మంచి క్రేజ్‌ ఉంది. అలాగే మాస్‌ హీరోగా కూడా. అయితే ఈ మధ్య నాని ఖాతాలో జమ అయిన హిట్స్‌ పరంపరకు తిరుగే లేకుండా పోతోంది. దాంతో నాని సినిమా వస్తుందంటే చాలు దానంతట అదే తెలియకుండానే హైప్‌ క్రియేట్‌ అయిపోతోంది. 

లాస్ట్‌ ఇయర్‌ వరుస హిట్స్‌తో దూస్కెళ్లిన నాని, ఈ సారి డబుల్‌ ధమాకా ఇస్తున్నాడు. అదే 'కృష్ణార్జున యుద్ధం'. మేర్లపాక గాంధీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో నాని డబుల్‌ రోల్‌ పోషిస్తున్న సంగతి తెలిసిందే. కృష్ణ, అర్జున్‌ అనే ఈ రెండు పాత్రలతోనూ నాని ఫుల్‌గా ఎంటర్‌టైన్‌ చేస్తానంటున్నాడు. రెండు పాత్రలకూ వినోదం బాగా మేళవించారట. దాంతో హాట్‌ సమ్మర్‌లో కూల్‌ ఎంటర్‌టైనర్‌గా 'కృష్ణార్జున యుద్ధం' కొట్టుకెళ్లిపోయేలా ఉంది. ఈ సినిమాతో నానికి మరో హిట్‌ పక్కా అంటున్నారు. అనుపమా పరమేశ్వరన్‌, రుక్సార్‌ మీర్‌ ఇద్దరు కథానాయికలతో నాని జత కడుతున్నాడీ సినిమాలో. 

ఇప్పటికే రిలీజైన పాటలు మాస్‌ జనాల్లో విపరీతమైన క్రేజ్‌ సంపాదించుకున్నాయి. దిల్‌ రాజు సమర్పణలో ఈ సినిమా విడుదలవుతోంది. ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. అన్నట్లు హీరోగానే కాకుండా, గతేడాది నిర్మాతగా కూడా నాని సత్తా చాటాడు 'అ' సినిమాతో. అలాగే ఈ ఏడాది కూడా నాని నిర్మాణంలో 'అ' లాంటి అద్భుతాలు ఏమైనా వస్తాయేయో చూడాలిక. మరో పక్క నాగార్జునతో, నాని మల్టీస్టారర్‌ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS