'స్థాయి' అనేది ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది. టాలీవుడ్‌లో ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తోన్న శ్రీ రెడ్డి లీక్స్ గొడవకు అంతుండటం లేదు. ఏదో పాపులారిటీ లేని ఒక్క సినిమాలో నటించే శ్రీరెడ్డి టాలీవుడ్‌లో ఏదో ఉందని పలువురు సినీ ప్రముఖులపై ఇంతలా ఆరోపణలు చేస్తోంది.
స్టార్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లో ఎన్నో సక్సెస్ ఫుల్ చిత్రాలు చేసి, తెలుగుతో పాటు, తమిళం, హిందీ భాషల్లో కూడా పాపులర్ హీరోయిన్‌గా వెలుగొందుతోన్న రకుల్ ప్రీత్‌సింగ్ అలా కాదు. ఆమెపై అనవసరంగా అసభ్యకరమైన కామెంట్స్‌తో విరుచుకుపడుతోంది శ్రీరెడ్డి. పళ్లు రాలగొడతానంటోంది. గెడకర్ర అంటోంది. రెక్కపీతా.. అంటూ ఏవేవో పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తోంది. అయితే ఏ సామాజిక అంశం పైనైనా స్పందించడంలో రకుల్ ప్రీత్‌సింగ్ ముందుంటుంది.
అలాంటిది, శ్రీరెడ్డి లీక్స్‌పై రకుల్ స్పందించడం లేదేంటి? అనుకుంటున్నారు చాలా మంది. రకుల్ మాట్లాడడానికి ఆ స్థాయి అడ్డొస్తోంది. ఇలాంటి చీప్ ఇష్యూపై స్పందించి, తన స్థాయిని తాను దిగజార్చుకోవడమా అని రకుల్ భావిస్తోంది కాబోలు. అయినా కానీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో రకుల్ కూడా అవకాశాల కోసం చాలా కష్టపడింది. అంత తేలిగ్గా ఏమీ అవకాశాలు వచ్చిపడలేదు ఆమెకు. మొదట్లో నటన, డాన్సింగ్ వంటి విషయాల్లో రకుల్‌పై చాలా కామెంట్స్ వచ్చాయి. మెల్లమెల్లగా తనని తాను అప్‌డేట్ చేసుకుంది అన్ని విషయాల్లోనూ రకుల్. సినిమా ఒక్కటే జీవితం కాదని, జిమ్ బిజినెస్ స్టార్ట్ చేసింది. సేవా కార్యక్రమాల్లో కూడా అప్పుడప్పుడూ పాల్గొంటూ ఉంటుంది.
లైంగిక వేధింపుల నుండి ఎలా బయటపడాలి అనే అంశంపై స్పెషల్‌గా ఓ ఈవెంట్ కూడా కండక్ట్ చేసింది. చెప్పుకుంటూ పోతే రకుల్ విషయంలో ఇలాంటివి ఒక్కటి కాదు, చాలానే ఉంటాయి. అలాంటిది రకుల్‌ని ఇంత చీప్ చేసి మాట్లాడుతోన్న శ్రీరెడ్డికి ఎలా కౌంటర్ ఇవ్వాలి చెప్పండి.!