తీవ్ర విషాదంలో సంగీత దర్శకుడు మణిశర్మ

By iQlikMovies - May 01, 2018 - 13:17 PM IST

మరిన్ని వార్తలు

ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ కి పితృవియోగం.

అందుతున్న సమాచారం ప్రకారం, మణిశర్మ తండ్రిగారైన వై.యెన్. శర్మ (92) ఈరోజు చెన్నైలోని వారు స్వగృహంలో కన్నుమూసారట. ఆయన పూర్తి పేరు- యనమండ్ర నాగ యజ్ఞ శర్మ, ఈయన ప్రముఖ వయోలిన్ కళాకారుడు.

ప్రస్తుతం మణిశర్మ కుటుంబం చెన్నైలో నివసిస్తున్నది. ఇక ఈ వార్త తెలియగానే తెలుగు పరిశ్రమ నుండి మణిశర్మ కుటుంబానికి తమ ప్రగాడ సానుభూతిని తెలియపరుస్తున్నారు. మరికొంతమందిమణిశర్మ శ్రేయోభిలాషులు, స్నేహితులు స్వయంగా వై.యెన్. శర్మ పార్థివదేహానికి నివాళ్ళు అర్పించడానికి చెన్నై వెళ్ళే ఆస్కారం కూడా ఉంది అని తెలుస్తున్నది.

ఈ విషాద వార్త నేపధ్యంలో వై.యెన్. శర్మ గారి మృతికి www.iQlikmovies.com తరపున విచారం వ్యక్తం చేస్తున్నాము.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS