రేపు అనగా జూన్ 1న వరుస పెట్టి మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 'ఆఫీసర్', 'రాజుగాడు,', 'అభిమన్యుడు'. వర్మ - నాగ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'ఆఫీసర్' సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. చాలా రోజుల తర్వాత ఫుల్ లెంగ్త్ యాక్షన్ రోల్‌లో నాగార్జున కనిపిస్తున్న చిత్రమిది. యాక్షన్ కంటెన్ట్‌తో పాటు, సెంటిమెంట్ డోస్ కూడా బాగానే ఉన్నట్లు కనిపిస్తోంది ఈ సినిమాలో. ఓ పాప కోసం ఆఫీసర్ చేసే సాహసాలతో వర్మ సరికొత్తగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.
ఇకపోతే 'రాజుగాడు'. యంగ్ హీరో రాజ్‌తరుణ్ , అందాల భామ అమైరా దస్తూర్ జంటగా తెరకెక్కిన చిత్రమిది. ఎప్పుడో విడుదల కావల్సిన చిత్రమిది. ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. మూస కథలతో రాజ్‌తరుణ్ బోర్ కొట్టించేస్తున్నాడు. అలాంటిది 'రాజుగాడు'తో రాజ్‌తరుణ్ ఏం చేస్తాడో. ఇకపోతే ముచ్చటగా మూడోది 'అభిమన్యుడు'. ఆల్రెడీ ఈ సినిమా తమిళంలో విడదలైంది. అయితే విశాల్ సినిమాలు కొత్తగా ఉంటాయి.
'అభిమన్యుడు' సైబర్ క్రైమ్స్ ఆధారంగా తెరకెక్కిన చిత్రం కావడంతో ఆడియన్స్‌లో ఆశక్తి బాగానే ఉంది. తెలుగులో ప్రమోషన్స్ కూడా బాగా చేశాడు విశాల్. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో సమంత హీరోయిన్‌గా నటించింది. సమంత ఇప్పుడు ఫుల్ స్వింగ్‌లో ఉంది. 'రంగస్థలం', 'మహానటి' చిత్రాలతో వరుస హిట్లు కొట్టింది. దాంతో డబ్బింగ్ సినిమా అయినా ఈ సినిమా వైపే ఆడియన్స్ ఎక్కువగా మొగ్గు చూపే అవకాశాలున్నాయనిపిస్తోంది.
డైరెక్ట్ సినిమా, భారీ అంచనాలున్న సినిమా 'ఆఫీసర్' వైపు మొగ్గు చూపుతారా? లేక డబ్బింగ్ సినిమా అయిన 'అభిమన్యుడు'ని ఆదరిస్తారా? అనే ఫైనల్ డెసిషన్ ఆడియన్స్‌దే.