నాగార్జున - రామ్‌గోపాల్ వర్మ కాంబినేషన్‌లో దాదాపు 28 ఏళ్ల తర్వాత తెరకెక్కుతోన్న చిత్రం 'ఆఫీసర్'. అస్సలు ఫామ్‌లో లేని వర్మతో నాగార్జున సినిమా ఏంటని మొదట్లో అంతా ఆశ్చర్యపోయారు. అయితే సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొలదీ, సినిమాపై అంచనాలు మెల్ల మెల్లగా పెరుగుతున్నాయి.
నిన్న మొన్నటి దాకా ఈ సినిమాని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. 'ఆఫీసర్' అంచనాల్ని అందుకునేలా ఉంది. చిత్రయూనిట్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే, ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చేలా ఉన్నాయని ఇటు సినీ ట్రేడ్ వర్గాలు, అటు ఆడియన్స్ ఇద్దరూ భావిస్తున్నారు. ఫామ్‌లో లేకపోయినా వర్మని అంత తేలిగ్గా తీసి పారేయడానికి లేదు. ఏదైనా మ్యాజిక్ చేయగలడు వర్మ. ఆ మ్యాజిక్ 'ఆఫీసర్'తో ఖచ్చితంగా వర్మ చేసే ఉంటాడని వర్మ అభిమానులు యోచిస్తున్నారు. దాంతో సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
ఇంతవరకూ ఫ్యామిలీ మూవీస్ చేస్తూ వచ్చిన నాగార్జున సడెన్‌గా యాక్షన్ వైపు మొగ్గు చూపడం, వర్మ చెప్పిన 'ఆఫీసర్' స్టోరీ నాగ్‌ని అంతగా ఇంప్రెస్ చేయడం తదితర అంశాలు 'ఆఫీసర్'ని ఎక్కడో నిలబెట్టేలా ఉన్నాయి. మొత్తానికి అప్పట్లో 'శివ'తో వర్మకు నాగార్జున బ్రేక్ ఇచ్చాడు. ఇప్పుడు మళ్లీ నాగార్జున సినిమాతోనే వర్మ బౌన్స్ బ్యాక్ అవుతాడనిపిస్తోంది.
చూడాలి మరి 'ఆఫీసర్'తో నాగ్ - వర్మ ఇద్దరూ సక్సెస్ కొడతారా ?లేదా? అని. జూన్ 1న 'ఆఫీసర్' ప్రేక్షకుల ముందుకు రానుంది.