తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తరువాత ఎవరు అంటే మనకి గుర్తు వచ్చే వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ. ఆయన అసలు పేరు శివ రామకృష్ణ ఘట్టమనేని, మే 31 1942 లో గుంటూరు జిల్లా బుర్రిపాలెం గ్రామంలో జన్మించారు. సినిమాల మీద మక్కువతో మద్రాస్ వెళ్లి నటుడిగా తనదైన ముద్ర వేసుకున్నారు. మొట్ట మొదటి ఈస్టమన్ కలర్, 70ఎమ్ఎమ్, సినిమాస్కోప్ మరియు డి.టి.ఎస్ చిత్రాలు తెలుగు చిత్ర సీమకి పరిచయం చేసింది సూపర్ స్టార్ కృష్ణ అనే చెప్పాలి.
దాదాపు 300 కు పైగా చిత్రాలలో నటించారు. తేనే మనుసులు, గూఢచారి 116, మోసగాళ్లకు మోసగాడు, పండంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, ఈనాడు, సింహాసనం మరియు అల్లూరి సీతారామరాజు వంటి చిత్రాలు అతని విజయవంతమైన చిత్రాల్లో కొన్నిమాత్రమే. సూపర్ స్టార్ కృష్ణ రోజుకి పద్దెనిమిది గంటలు పనిచేస్తారంటే అతిశయోక్తి కాదు. అదే అతనిని సూపర్ స్టార్ ని చేసింది. ఎంతో మంది అభిమానులని కూడా సంపాదించి పెట్టింది.
ఒకే సంవత్సరంలో పద్దెనిమిది చిత్రాల్లో నటించిన ఘనత కూడా సూపర్ స్టార్ కృష్ణ గారికే దక్కుతుంది. ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో మరెన్నో రికార్డులు అతని లిస్ట్ లో ఉంటాయి. అందుకే ఈ యువతరానికి ఆయన ఒక ఇన్స్పిరేషన్ అయ్యారు. మన సూపర్ స్టార్ కృష్ణ గారు ఈ రోజు 76వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు.
ఈ సందర్బంగా ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఐక్లిక్ మూవీస్ తరపున మన బుర్రిపాలెం బుల్లోడికి జన్మదిన శుభాకాంక్షలు.