ఎన్టీఆర్‌లో రానా హీరోనా? విలనా?

మరిన్ని వార్తలు

స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్రగా తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర్‌' బయోపిక్‌లో దగ్గుబాటి రానా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడన్న సంగతి తాజాగా రానా తన ట్విట్టర్‌ ద్వారా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్‌ ఉంది. ఇప్పుడీ ట్విస్టే టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. 

ఎన్టీఆర్‌ బయోపిక్‌ అంటే ప్రధాన పాత్ర ఎన్టీఆర్‌దే. ఆ పాత్ర పోషిస్తోంది నందమూరి బాలకృష్ణ. సో బాలయ్యే ఈ సినిమాకి హీరో. ఇందులో నో డౌట్‌. అయితే ఈ బయోపిక్‌లో మరో కీలక పాత్రధారి నారా చంద్రబాబు నాయుడుగారు. ఈయన పాత్ర పోషిస్తున్న రానా ఇటీవల చంద్రబాబును కలిసి ఆ పాత్రకు సంబంధించిన పలు విషయాలను తెలుసుకున్నారు. 

ఇకపోతే ఈ బయోపిక్‌ వెనక తెలుగుదేశం పార్టీ పాత్ర ఎక్కువగా ఉందట.. సీఎం చంద్రబాబు నాయడి కను సన్నల్లో ఈ బయోపిక్‌ నిర్మాణం జరుగుతోందట.. సినిమాకి సంబంధించిన ప్రతీ ముఖ్య విషయాన్ని నారా చంద్రబాబునాయుడు గారితోనే సంప్రదిస్తున్నారట.. ఈ సినిమాలో చంద్రబాబు పాత్ర హీరో అవుతుందట.. పేరుకు ఎన్టీఆర్‌ బయోపిక్‌ అయినా, తనను రాజకీయంగా ఎలివేట్‌ చేసుకునేందుకు ఈ సినిమాని చంద్రబాబు వాడుకుంటున్నారట.. అనే ప్రచారం జరుగుతోంది. 

అయితే బాలయ్య ఆ ప్రచారాన్ని కొట్టి పారేశారు. ఈ సినిమాకీ, తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చేశారు. ఎన్టీఆర్‌ జీవితంలో అతి ముఖ్యమైన రాజకీయ వెన్నుపోటు ఎపిసోడ్‌ ఈ సినిమాలో ఉంటుందో లేదో కానీ, చంద్రబాబు పాత్రలో కనిపించనున్న రానా హీరోయిజం ప్రదర్శిస్తాడా? లేక విలనిజంతో ఆకట్టుకుంటాడా? అనే ఉత్కంఠ మాత్రం తారా స్థాయికి చేరుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS