మాస్ మహరాజ్ రవితేజ ఆరునెలల గ్యాప్ లో రెండు చిత్రాలు- రాజా ది గ్రేట్ & టచ్ చేసి చూడు విడుదల చేసేశాడు. అయితే అందులో రాజా ది గ్రేట్ చిత్రం హిట్ అవ్వగా టచ్ చేసి చూడు చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తాపడింది.
ఇక దీనితో ఆయన ఒక హిట్ మరియు ఒక ఫ్లాప్ తో ఒక లెవెల్ లో ఫిక్స్ అయ్యాడు. అయితే ఆయన కెరీర్ ఎలా ఉన్నప్పటికీ తాను మాత్రం రెమ్యునరేషన్ విషయంలో ఎటువంటి తగ్గుదలని ఆయన ఒప్పుకోవట్లేదట. ఒక పరాజయం వచ్చినప్పటికీ ఆయన తను చేయబోయే చిత్రానికి సుమారు రూ 13 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నాడట.
రవితేజ కి ఉన్న క్రేజ్ బట్టి కొంచెం మంచి కథ ఆయనకి దొరికితే పక్కా అది కమర్షియల్ గా మంచి వసూళ్ళనే రాబడుతుంది అన్న నమ్మకం ట్రేడ్ వర్గాల్లో ఉంది. అందుకే రవితేజ రెమ్యునరేషన్ విషయంలో ఆయన డిమాండ్ ని సైతం నిర్మాతలు స్వాగతిస్తున్నారట.
మరి... ఈ డిమాండ్ నిర్మాతలకి చేదు అనుభవంగా మిగలడం మిగలకపోవడం అనేది భవిష్యత్తు తేల్చుతుంది.