వరుస హిట్స్ తో కెరీర్ లో దూసుకుపోతున్న నాని ఇప్పుడు ప్రొడ్యూసర్లుకి కల్పవృక్షంలా తయారయ్యాడు. సినిమా యావరేజ్ గా ఉన్నా కూడా అతని క్రేజ్ తో హిట్ చేసేంతలా ఆయన స్టార్ డం రోజురోజుకి పెరుగుతున్నది.
ఈ సమయంలో ఆయన తనకి వచ్చిన క్రేజ్ ని రెమ్యునరేషన్ రూపంలోకి మలుచుకోవాలని చూస్తునట్టుగా అర్ధమవుతున్నది. అదేలా అంటే- ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పక్కకి పెట్టి ఇక చేయబోయే చిత్రాలకి సుమారు రూ 9కోట్ల వరకు అడుగుతున్నట్టు సమాచారం.
ఏ హీరో అయినా లేక హీరోయిన్ అయినా సరే తమకి మార్కెట్ ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్న ఫార్ములాని నాని తూచా తప్పకుండా పాటిస్తున్నట్టుగా తెలుస్తున్నది. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఈ స్థాయికి చేరుకోవడం నిజంగా మెచ్చుకోవలిసిన విషయం.
ప్రస్తుతం నాని చేతిలో రెండు చిత్రాలు హీరోగా చేస్తున్నవి ఉన్నాయి అలాగే నిర్మాతగా మారి చేసిన చిత్రం ‘అ’ ఈ నెల 16వ తేదీన విడుదలకానుంది.