రామ్‌గోపాల్ వర్మ - అఖిల్ కాంబినేషన్లో ఓ సినిమా రానుందని ప్రచారం జరుగుతోంది. ప్రచారమే కాదు, వర్మ తన ట్విట్టర్లో ఈ విషయాన్ని ప్రకటించారు ముందు. అయితే ఈ విషయంలో నాగార్జున కానీ, అఖిల్ కానీ ఇంతవరకూ స్పందించలేదు. అయితే ఒకవేళ 'ఆఫీసర్' సినిమా ప్రమోషన్స్‌లో నాగార్జున ఈ విషయంపై స్పందించనున్నారేమోననిపిస్తుంది.
మరో పక్క వర్మ ఇదంతా పబ్లిసిటీ కోసమే చేశాడని భావిస్తున్నారు. అలా భావించినవారికి వర్మ తనదైన స్టైల్లో షాకిస్తాడంటోంది వర్మ సన్నిహిత వర్గం. అయితే ఇంతకీ ఈ కాంబినేషన్ వర్కవుటవుతుందో లేదో తెలీదు. కానీ వర్మ - నాగార్జున కాంబినేషన్లో రూపొందిన 'ఆఫీసర్' చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న వర్మ తాజాగా ప్రచారంలో ఉన్న అఖిల్ సినిమాపై మళ్లీ స్పందిస్తాడో లేదో చూడాలి మరి. మరో పక్క అఖిల్ ప్రస్తుతం 'తొలిప్రేమ' సినిమాని తెరకెక్కించిన యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాతో పాటు, మరిన్ని కొత్త కథలను వినే పనిలో కూడా బిజీగా ఉన్నాడట. వాటిలో రెండు కథలు ఆల్రెడీ అఖిల్‌ని ఇంప్రెస్ చేశాయనీ తెలుస్తోంది. అసలింతకీ వర్మతో అఖిల్ సినిమా పట్టాలెక్కేనా? లేక ఎప్పటిలానే వర్మ చేసే పబ్లిసిటీ స్టంట్స్ లిస్ట్‌లో ఇదీ ఒక భాగమా అనేది తేలాల్సి ఉంది.