ఇప్పుడు ఎక్కడ చూసినా అందరు మాట్లాడుకుంటున్న ఏకైక అంశం- రామ్ చరణ్ ‘రంగస్థలం’. ఇక సెలబ్రిటీలు సైతం ఈ చిత్రం పైన ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అయితే ఒక మెగా హీరో మాత్రం ఇంకా ఈ చిత్రం పైన స్పందించకపోవడం గమనార్హం.
ఆ హీరో మరెవరో కాదు- స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. దాదాపుగా ఏ పబ్లిక్ ఈవెంట్ లో మనం చూసినా రామ్ చరణ్ ని సపోర్ట్ చేస్తుంటాడు అలాగే దర్శకుడు సుకుమార్ అయితే అతని ఆప్తమిత్రుడు అనే చెప్పొచ్చు. అలాంటిది ఈ ఇద్దరు కలిసి చేసిన చిత్రం, బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న చిత్రాన్ని ఆయన చూడకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అయితే దీనికి కారణం అల్లు అర్జున్ అమ్మగారు అని తెలుస్తున్నది. సాధారణంగా అల్లు అర్జున్ లాంటి సెలబ్రిటీలు సినిమాలని తమ హోం ధియేటర్ లో చూస్తుంటారు. అయితే ఇంత మంచి చిత్రాన్ని సాధారణ ధియేటర్ లో చూస్తేనే బాగుంటది అని ఆమె ఇచ్చిన సలహా మేరకే తమ కుటుంబంతో ఒక ధియేటర్ లో చూస్తారు అని తెలుస్తుంది.
అందుకే ఈ సినిమాని బన్నీ ఇంకా చూడలేదు అని సమాచారం.