నాగ్‌ - వర్మ కొట్టేలానే ఉన్నారు

By iQlikMovies - May 24, 2018 - 11:23 AM IST

మరిన్ని వార్తలు

సంచలనాల దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ, నాగార్జున కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న 'ఆఫీసర్‌' చిత్రం జూన్‌ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంతవరకూ ఈ సినిమా నుండి రెండు టీజర్స్‌ వచ్చాయి రెండూ యాక్షన్‌ బ్యాక్‌ డ్రాప్‌లోనే ఉన్నాయి. 

లేటెస్టుగా విడుదలైన ఓ సాంగ్‌ టీజర్‌ విశేషంగా ఎట్రాక్ట్‌ చేస్తోంది. తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్‌ని తలపించేలా ఉందీ టీజర్‌. ఓ పాపను కాపాడే నేపథ్యంలో ఓ పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌ ఎలాంటి సాహసాలు చేశాడు? అనే కాన్సెప్ట్‌పై ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. లేటెస్టుగా విడుదలైన సాంగ్‌ టీజర్‌లో ఆ పాప, నాగార్జున మధ్య అనుబంధాన్ని ఎంతో హృద్యంగా చూపించాడు వర్మ. 

యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ అంటే, 28 ఏళ్ల క్రితం వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'శివ' సినిమాకి సీక్వెల్‌గా ఉండొచ్చని అనుకున్నారంతా. కానీ ఆ ఫ్లేవర్‌ ఎక్కడా లేదీ సినిమాకి అని తాజా టీజర్‌తో అర్ధమైపోయింది. పక్కా యాక్షన్‌ అండ్‌ ఎటాచ్‌డ్‌ సెంటిమెంట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. వర్మ ఈ సినిమాని తన సొంత బ్యానర్‌ కంపెనీలో నిర్మిస్తున్నాడు. 

ఈ సినిమాతో వర్మ బౌన్స్‌ బ్యాక్‌ అవడం ఖాయమనే నమ్మకం అంతకంతకూ పెరుగుతోంది. మిరా సరీన్‌ అనే కొత్త భామ ఈ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమవుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS