ఇటీవల కాలంలో రవితేజ ఏ సినిమా మీదా ఇంత కాన్ఫిడెంట్‌గా లేడు. దాదాపు రెండేళ్లు పూర్తిగా సినిమాలకు దూరంగా ఉన్న రవితేజ 'రాజా ది గ్రేట్' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. రీ ఎంట్రీలో వచ్చిన ఈ సినిమా రవితేజకి మంచి సక్సెస్‌నే ఇచ్చింది. కానీ ఆ తర్వాత వచ్చిన 'టచ్ చేసి చూడు' నిరాశ పరిచింది.
ఇప్పుడు 'నేల టికెట్టు' సినిమాతో రాబోతున్నాడు. కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. అతి త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ సినిమాపై రవితేజ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. ఖచ్చితంగా హిట్ కొడతానని గట్టిగా చెబుతున్నాడు. ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌ని పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌ని గెస్ట్‌గా ఆహ్వానించి, ఆల్రెడీ పవన్ ఫ్యాన్స్‌ని లైన్‌లో పెట్టేశాడు.
ఇకపోతే ఈ సినిమాకి ప్రమోషన్ కార్యక్రమాలు కూడా బాగా చేస్తున్నారు. రవితేజలో మునుపటి గ్రేస్, మాస్ ఈ సినిమాలో సుస్పష్టంగా ఉన్నాయనీ, ఇటీవల విడుదలైన ట్రైలర్ ద్వారా అర్ధమయిపోయింది. దాంతో రవితేజ ఈజ్ బ్యాక్ అనేలాగే ఈ సినిమా ఉండబోతోందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ప్రీ రిలీజ్ బజ్ ఇంత పోజిటివ్‌గా ఉండడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. కళ్యాణ్ కృష్ణ స్క్రీన్‌ప్లే టేకింగ్‌తో ఆల్రెడీ రెండు హిట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టేలాగే ఉన్నాడు.
ఇకపోతే హీరోయిన్ మాళవికా శర్మ న్యూ ఎంట్రీ అయినప్పటికీ, చాలా బాగా ఎట్రాక్ట్ చేస్తోంది. యాక్టింగ్ టాలెంట్ సంగతేమో కానీ, ప్రమోషన్స్‌లోనే గ్లామర్‌తో పిచ్చెక్కించేస్తోంది. ఇవన్నీ చూస్తుంటే, మాస్ రాజా రవితేజకి 'నేల టికెట్టు' పక్కా హిట్టే అనిపిస్తోంది.