'ఆఫీసర్‌'లో ఆ యాంగిల్‌ ఉందా?

మరిన్ని వార్తలు

రామ్‌గోపాల్‌ వర్మ - నాగార్జున కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం 'ఆఫీసర్‌'. ఈ నెల 9న టీజర్‌ విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్‌ ఆఫీషియల్‌గా ప్రకటించింది. వర్మ - నాగ్‌ కాంబోపై భారీ అంచనాలున్నాయి. నిజానికి వర్మతో నాగార్జున అప్పట్లో నాలుగైదు సినిమాల్లో నటించారు. 

కానీ వాటిన్నింట్లోకీ, ఈ కాంబినేషన్‌ అంటే ముందుగా గుర్తొచ్చేది, తెలుగు సినిమా ఈక్వేషన్స్‌ని మార్చేసిన సినిమా అంటే 'శివ' సినిమానే. అప్పట్లో 'శివ' ఓ సంచలనం. అయితే ఈ మధ్య వర్మ తెరకెక్కిస్తున్న సినిమాల్లో అంతగా సీనుండట్లేదు. కానీ ఈ సినిమాతో వర్మ మళ్లీ బౌన్స్‌ బ్యాక్‌ అవుతాడనిపిస్తోంది. ఇదిలా ఉంటే, సినిమా సీరియస్‌ మూవీగా అనిపిస్తోంది పోస్టర్స్‌ చూస్తుంటే. ఇలాంటి సినిమాలను తెరకెక్కించడంలో వర్మకి అపారమైన అనుభవం ఉంది. అయితే నాగార్జున అంటే టాలీవుడ్‌ మన్మధుడు. గ్లామర్‌ ఉండాల్సిందే. మరి ఈ సినిమాలో గ్లామర్‌ పాళ్లు ఏ స్థాయిలో ఉన్నాయో తెలీదు. అది తెలుసుకోవాలంటే టీజర్‌ వచ్చేదాకా ఆగాల్సిందే. 

ఇకపోతే నాగార్జున లుక్స్‌ చాలా డిఫరెంట్‌గా అనిపిస్తున్నాయి. పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌ పాత్రలో నాగార్జున నటిస్తున్నాడు. మిరా సరీన్‌ అనే కొత్త భామ హీరోయిన్‌గా నటిస్తోంది. మిరా సరీన్‌ లుక్స్‌ హాట్ట్‌గానే కనిపిస్తున్నాయి. ఫిజిక్‌ ఫర్‌ఫెక్ట్‌గా ఉంది. మరి, నాగ్‌, మిరాల మధ్య కెమిస్ట్రీ ఏ రేంజ్‌లో ఉందో చూడాలి మరి. ఓ పాపను కాపాడే నేపథ్యంలో ఈ సినిమా స్టోరీ సాగనుంది. సినిమాని మే 25న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా వర్మ సొంత బ్యానర్‌ అయిన 'కంపెనీ'లో రూపొందుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS