'వైఎస్సార్‌' స్టిల్‌ అదిరింది గురూ.!

మరిన్ని వార్తలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా తమ సేవలనందించిన దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి బయోపిక్‌ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తమిళ స్టార్‌ హీరో మమ్ముట్టి ప్రధాన పాత్రలో ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా ఫస్‌టలుక్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్‌.

 

వైఎస్సార్‌ పాత్రలో మమ్ముట్టి స్టైల్‌ చాలా బాగుంది. స్టిల్‌ నిజంగానే చాలా బాగుంది. మమ్ముట్టి మహానటుడు. ఈ సంగతి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి గెటప్‌లో అచ్చంగా అలాగే కనిపిస్తున్నాడు. ఈ పాత్ర కోసం మమ్ముట్టి చాలా రీసెర్చ్‌ చేశాడట. ముఖ్యమంత్రి పదవికి అందం తెచ్చిన నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి. తన అప్పియరెన్స్‌తో, మంచు గడ్డల్లాంటి తన మాటలతో ప్రజల మనసులో ఉన్నత స్థానాన్ని ఏర్పర్చుకున్న రాజకీయ నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి. 

వృత్తి రీత్యా వైద్యుడు కావడంతో, ముఖ్యమంత్రిగా వైద్య రంగంలో ఆయన అందించిన సేవలు అమోఘం. ఇప్పటికీ ఆయన మొదలు పెట్టిన వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోనే ఉన్నాయి. ఇప్పుడీ సినిమాలో ఆయన జీవిత గాధలోని ముఖ్య ఘట్టాలను తెరపై చూపించనున్నారట. అలాగే చనిపోయేదాకా ఆయన ప్రజలకు అందించిన సేవలను ఆయన యాక్సిడెంట్‌ ఎపిసోడ్‌ని కూడా కళ్లకు కట్టినట్లుగా చూపించనున్నారట. 

'ఆనందోబ్రహ్మ' వంటి భిన్నమైన కథా చిత్రాన్ని తెరకెక్కించిన మహి.వి.రాఘవ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఎల్లుండి నుండి ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS