శ్రీరెడ్డి అరవ ముచ్చట కూడా అయిపోయిందా.?

మరిన్ని వార్తలు

తెలుగు సినీ ప్రముఖులపై విచ్చలవిడిగా అసభ్యకర ధూషణలు, అభ్యంతరకర ఆరోపణలు చేసిన శ్రీరెడ్డిని ఇక్కడ ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో, ఈ మధ్యనే తమిళనాడుపై దృష్టి పెట్టింది. అదే తమిళ సినీ ఇండస్ట్రీపై. అక్కడ పలువురు ప్రముఖ నటులపై ఇటీవల శ్రీరెడ్డి చేసిన ఆరోపణల పర్వం గురించి తెలిసిందే. 

ఈమె ఆరోపించిన వారిలో కొందరు స్పందించారు. కొందరు అస్సలు పట్టించుకోలేదు. అక్కడ కూడా శ్రీరెడ్డి హవా నిలబడలేదని తేలిపోయింది. దాంతో ప్రస్తుతం శ్రీరెడ్డి కామప్‌ అయిపోయింది. ఇక ఆమె లిస్టులో కన్నడ, మలయాళ పరిశ్రమలున్నాయి. అటు కూడా ఓ లుక్కేసి వస్తుందేమో చూడాలి మరి. ఆ పై బాలీవుడ్‌కీ తన ఆరోపణల సెగ తగిలిస్తుందేమో. 

తెలుగులోనూ తమిళంలోనూ చేసిన రచ్చకే శ్రీరెడ్డిని ఎవరూ కన్సిడర్‌ చేయలేదు. కనీసం ఆమెతో గోలెందుకులే అని ఒక్క అవకాశం కూడి ఇచ్చి చూడలేదు. అలాంటిది బాలీవుడ్‌కి వెళ్లి శ్రీరెడ్డి ఇంకేం చేస్తుంది.? ఆమె హవా అంతా జస్ట్‌ సోషల్‌ మీడియా వరకే. సోషల్‌ మీడియాలో మంచి, చెడుకి సంబంధించిన పలు అంశాలపై జరిగే చర్చల్లో శ్రీరెడ్డి 'ఛీ' చర్చలు పట్టించుకునేది ఎంతమంది చెప్పండి. 

పాపం శ్రీరెడ్డి కొంతవరకూ లిమిట్స్‌లో ఉన్నా, సరిపోయేది. అదుపు తప్పిన నోటితో ఉన్నది ఊడిపోయే, ఉంచుకున్నదీ ఊడిపోయే అన్న చందంగా మారింది. అప్పటి వరకూ ఎప్పటికో అప్పటికి ఏదో ఒక అవకాశమైనా చిక్కుతుందిలే అనుకుంటే, అలాంటి ఆలోచనలకే దూరమైపోయి, ఒంటరిగా మిగిలిపోయిందిప్పుడు పాపం శ్రీరెడ్డి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS