సినిమా అవకాశాలు కోరుకుంటోందా? వివాదాల పేరుతో పబ్లిసిటీ పొందాలనుకుంటోందా? సోషల్ మీడియా హాట్ బాంబ్ శ్రీరెడ్డి వ్యవహారం ఇప్పుడెవరికీ మింగుడుపడ్డంలేదు. సినీ పరిశ్రమపై ఆమె చేస్తున్న ఆరోపణలు అత్యంత హాస్యాస్పదంగా మారిపోయాయి. సినీ పరిశ్రమలో పది శాతమో, పాతిక శాతమో 'ఆమె చెబుతున్న టైపు' జనాలు వుండొచ్చేమో.
కానీ, ఏకంగా 90 శాతం అలాంటోళ్ళే వుంటారంటే ఎలా? అవకాశాల్ని కోరుకుని, భంగపడ్డాక.. తనకు అవకాశాలివ్వనివారందరిపైనా ఆరోపణలు చేయడం శ్రీరెడ్డికి తగదంటూ ఆమెకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ దర్శనమిస్తున్నాయి. శ్రీరెడ్డికి న్యూస్ ఛానల్స్‌లో దొరుకుతోన్న స్పేస్ పట్ల కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతుండడం గమనార్హం. సినీ పరిశ్రమ మీద ఎవరో కుట్రపన్నారనీ, ఆ కుట్రలో బాగంగానే కొందర్ని ఓ సెక్షన్ మీడియా ఎంటర్‌టైన్ చేస్తోందనీ సినీ వర్గాల్లో గుసగుసలు వినవస్తున్నాయి.
మొన్న కత్తి మహేష్, ఇప్పుడు శ్రీరెడ్డి న్యూస్ ఛానల్స్‌లో అనూహ్యంగా స్పేస్ దక్కించుకుంటున్నారు. మామూలుగా అయితే న్యూస్ ఛానల్స్‌లో స్పేస్ చాలా విలువైనది. అయితే ఈ మధ్యకాలంలో రేటింగ్స్ తగ్గడంతో ఈ తరహా వివాదాలను కొన్ని ఛానల్స్ ఆశ్రయిస్తున్నాయి. ఆ కోవలోనే కత్తి మహేష్, శ్రీరెడ్డి లాంటివాళ్ళకు అవకాశాలు దక్కుతున్నాయనీ, ఈ క్రమంలో వారు తమను తాము ఎక్కువ ఊహించేసుకుని ఓవరాక్షన్ చేస్తున్నారనీ కొందరు అభిప్రాయపడ్తున్నారు.
ఏదేమైనా ఎవరి పేరు గుర్తుకొస్తే, వారి పేరుతో లీక్స్ ఇచ్చేసి, ఆయా వ్యక్తుల్ని రోడ్డుకీడ్చేయాలనుకుంటున్న శ్రీరెడ్డి తీరు మాత్రం అభ్యంతకరమే.