వెండితెరపై డైలాగులు చెప్పడంలో దిట్ట. డైలాగులేనా? యాక్టింగ్ అదరగొట్టేస్తాడంతే. సెంటిమెంట్ అయినా, ఇంకేదైనా యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కి నటనలో తిరుగులేదంతే. వెండితెరపై మాత్రమే కాదు, మనోడికి బుల్లితెర కూడా 'కొట్టిన పిండి' అయిపోయింది. చూసేశాం కదా, 'బిగ్‌బాస్' రియాల్టీ షోలో యంగ్ టైగర్ని. స్పాంటేనియస్‌గా యంగ్ టైగర్ డైలాగులు పేల్చేస్తూ, షోని ఓ రేంజ్లో పరుగులు పెట్టించేశాడు.
ఇప్పుడు మరో కొత్త పాత్రలోకి ఎంట్రీ ఇచ్చాడు ఎన్టీఆర్. ఈసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయాడు. ఇందులో తెలుగు వెర్షన్‌కి పబ్లిసిటీ చేస్తున్నాడీ తారకరాముడు. కారం లేని కోడి, ఉల్లిపాయ లేని పకోడీ, పెట్రోల్ లేని గాడీ.. ఇలాంటి పదాలతో పెద్ద గారడీనే చేసేశాడు. ఇంతలా ఎన్టీఆర్ డైలాగ్ దంచేస్తే, ఆ వీడియో వైరల్ కాకుండా వుంటుందా? అసలే దేశమంతా ఇప్పుడు ఐపీఎల్ ఫీవర్‌లో మునిగి తేలుతోందాయె. తెలుగు రాష్ట్రాలిప్పుడు ఎన్టీఆర్ వాడి వేడి చూపించిన ప్రోమో సందడిలో మునిగి తేలుతున్నాయి.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నోట ఐపీఎల్ గురించిన మాట రాగానే, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కే కొత్త గ్లామర్ వచ్చిందనడం అతిశయోక్తి కాదేమో. త్వరలో జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ దుమ్ము దులిపేయడం మాటేమోగానీ, కొత్త పాత్రలో యంగ్ టైగర్ అదరగొట్టేశాడంతే. యంగ్ టైగర్ అభిమానులకి ఇంతకన్నా సమ్మర్ కిక్ ఇంకేముంటుంది?