పవన్‌తో సినిమా చేయాలని మైత్రీ మూవీ మేకర్స్ చాలా సీరియస్‌గా ట్రై చేస్తోంది. 45 కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చి మరీ పవన్‌తో సినిమా చేయడానికి మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ రెడీగా ఉందని గతంలో గాసిప్ వచ్చింది. అయితే 'అజ్ఞాతవాసి' సినిమా తర్వాత పవన్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాల్లో బిజీ అయిపోయిన సంగతి తెలిసిందే. అయినా కానీ పవన్‌తో సినిమా చేయాలని గట్టి పట్టుతో ఉన్నారు మైత్రీ మూవీస్ బ్యానర్.
కాగా నిన్న రాత్రి పవన్ కళ్యాణ్ ఫ్యామిలీతో కలిసి 'రంగస్థలం' సినిమాని చూడ్డం వెనక మైత్రీ మూవీస్ సంస్థ కీలక భూమిక పోషించినట్లు తెలుస్తోంది. బాబాయ్‌ని అబ్బాయ్ పిలవడం ఒకెత్తయితే, మైత్రీ మూవీ మేకర్స్ నుండి పవన్ కళ్యాణ్‌కి ప్రత్యేకమైన ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా మైత్రీ వాళ్లు పవన్ కళ్యాణ్‌తో ప్రత్యేకమైన చర్చలు జరిపారనీ తెలుస్తోంది. అన్నీ కుదిరితే ఇకపై సినిమాలు చేయకూడదనే పవన్ తన ఆలోచనను పక్కన పెట్టేసి, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో ఓ సినిమా చేసే అవకాశాల్ని కొట్టి పారేయలేం.
తాజాగా మైత్రీ మూవీస్ బ్యానర్ నుండి వచ్చిన అబ్బాయ్ రామ్ చరణ్ 'రంగస్థలం' సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లు కొల్లగొడుతోంది. అలాగే బాబాయ్ ఒప్పుకుంటే కూడా ఈ సంస్థ నుండి మరో మంచి సినిమా వచ్చే అవకాశాలు లేకపోలేవు. ఏదిఏమైనా పవన్ - మైత్రీ కాంబినేషన్‌లో సినిమా వస్తే ఓ రేంజ్‌లో అభిమానులకి కిక్ ఇస్తుందని నిస్సందేహంగా చెప్పొచ్చు. కానీ, పవన్ అందుకు సుముఖంగా వున్నాడా? వేచి చూడాలిక.