హీరోల మధ్య పోటాపోటీ ఉండటం సర్వసాధారణమే.. అయితే ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణలకి దిగితే అది చాలా దూరం వరకు వెళ్ళి సదరు హీరోల కుటుంబాల పైన ఆ ప్రభావం పడుతుంది. దీనికి తాజా ఉదాహరణ బాలీవుడ్ లో జరిగింది.
ఆ వివరాల్లోకి వెళితే, మొన్న జరిగిన నటి సోనమ్ కపూర్ వివాహ రిసెప్షన్ లో ప్రముఖ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు హీరో అయిన సోహైల్ ఖాన్ భార్య సీమ ఖాన్ తో సీనియర్ నటుడు రిషి కపూర్ అసభ్యంగా ప్రవర్తించాడు. అంత పేరున్న సీనియర్ నటుడు ఇలా ప్రవర్తించడం ఏంటి అని అందరు షాక్ కి గురవుతున్నారు.
అయితే దీనికి కారణమేంటి ఏంటి అని ఆరా తీయగా- ఆ వివాహ రిసెప్షన్ వేడుకలో తనని సల్మాన్ ఖాన్ సరిగా పలకరించలేని కారణంగా దానిని అవమానంగా భావించి సల్మాన్ ఖాన్ తమ్ముడి భార్య పైన తన అసహనాన్ని వెళ్ళగక్కాడట.
ఈ విషయం తెలిసిన వెంటనే రిషి కపూర్ భార్య నీతు కపూర్ తన భర్త ప్రవర్తనకి సల్మాన్ ఖాన్ కుటుంబసభ్యులకి క్షమాపణలు చెప్పిందట. ఇక్కడితో ఈ మొత్తం అంశానికి తెరపడినట్టే అని అనుకుంటున్నారు.