సినిమాలో అశ్లీలం కారణంగా సమాజంలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయని లెక్చర్ దంచేస్తోంది ఓ మహిళ. ఆ మహిళ ఎవరో కాదు, శ్రీరెడ్డి. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు మరి. ఈ మధ్య అంతగా పాపులర్ అయిపోయిందీ పేరు.
బూతు పంచాంగంతో మూసుకుపోయిన తన నోటిని ప్రక్షాళన చేసుకుంటోంది కాబోలు శ్రీరెడ్డిలి ఇలా. ఈ మధ్య మహిళా సంఘాల సమావేశంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు కారణం సినిమాల్లో చూపించే అశ్లీల దృశ్యాలే అంటోంది పాపం ఈ పాప. ఇంటర్నెట్‌లో శ్రీరెడ్డి పేరు సెర్స్ చేస్తే ముందుగా వచ్చేవి జుగుప్సాకరమైన ఫోటోలే. ఇది తెలియని చాలా మందికి కూడా ఈ విషయం బాగా తెలిసిపోయింది ఈ మధ్య ఈవిడగారు రైజ్ చేసిన బూతు ఆరోపణల పర్వంతో. అవి చాలదన్నట్లు విచ్చలవిడిగా బూతులు మాట్టాడుతూ మీడియాకెక్కింది. ఇంటర్వ్యూలిచ్చింది.
ఇంత రాద్ధాంతం చేసింది. ఇదంతా పోనీ సినిమా కోసం ఉద్దరించిన వ్యవహారమా అంటే అదీ కాదు. అంతా సోషల్ మీడియా పబ్లిసిటీనే. సోషల్ మీడియాని ఎంత చండాలంగా వాడాలో అంత చండాలంగా వాడింది ఈ హాట్ నటి శ్రీరెడ్డి. ఇది చాలదన్నట్టు సోషల్ మీడియాలో తనపై ట్రోలింగ్ చేస్తున్నారంటూ, ఈ మధ్య పోలీసులకు ఫిర్యాదులు చేసింది. అదే సమయంలో ఆమె మీద కూడా కేసులు నమోదయ్యాయి.
మొత్తానికి ఏం చేసినా శ్రీరెడ్డి హడావిడి దాదాపు చల్లారిపోయింది. ఇప్పుడామెని ఎవరూ ఎంటర్‌టైన్ చేసే పరిస్థితి లేదు. సో టర్న్ తీసుకుని చేస్తున్న ఈ పవిత్ర ప్రసంగాలతో శ్రీరెడ్డి ఇంకేం సాధించాలనుకుంటోందో ఆమె వ్యక్తిత్వానికే వదిలేయాలి.