'అఖిల్' సినిమాతో యాక్షన్ హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు అక్కినేని హీరో అఖిల్. తొలి సినిమాతోనే యాక్షన్ ఇమేజ్‌ని పొందాలని ఎంతో ఆశగా అడుగు పెట్టాడు. అంతే కష్టపడి యాక్షన్ ఎపిసోడ్స్‌ని తెగ చేసేశాడు. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ మూవీ అఖిల్‌కి భారీగా నిరాశను మిగిల్చింది. తర్వాత రీ లాంచింగ్ అంటూ 'హలో' మూవీతో ప్రేక్షకుల్ని పలకరించాడు అఖిల్. అయితే ఈ సినిమాలోనూ అఖిల్‌కి యాక్టింగ్ పరంగా మార్కులు పడ్డాయే కానీ, కలెక్షన్స్ పరంగా కాసులు పండలేదు.
దాంతో ఈ సినిమా ఓకే అనిపించుకుంది. అయితే ఈ సినిమా కోసం కూడా అఖిల్ చాలా కష్టపడ్డాడు. మొత్తానికి అఖిల్ పడిన కష్టం ఊరికే పోలేదండోయ్. అవార్డు తెచ్చిపెట్టింది. ఆషా మాషీ అవార్డు కూడా కాదది. ఇంటర్నేషనల్ రేంజ్ అవార్డే. ఫారెన్ ఫిల్మ్ ఎట్ యాక్షన్ అవార్డ్స్ ఫంక్షన్‌లో బెస్ట్ యాక్షన్ ఫిల్మ్‌గా 'హలో' నామినేట్ అయ్యింది. ఈ విషయాన్ని 'హలో' సినిమా డైరెక్టర్ విక్రమ్ కుమార్ తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
ఈ సందర్భంగా యాక్షన్ కొరియోగ్రాఫర్స్ బాబ్ బ్రౌన్, పి.ఎస్.వినోద్‌లతో పాటు, ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చిన అనూప్ రూబెన్స్, సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన నాగార్జునకు ధన్యవాదాలు తెలిపారు. మా సినిమాకి ఇంతటి అపురూపమైన గౌరవం దక్కినందుకు చాలా గర్వంగా ఉందన్నారు. అఖిల్ డెడికేషన్‌కీ, హార్డ్ వర్క్‌కీ దక్కిన ప్రతిఫలమిది.. అని అఖిల్‌ని అభినందిస్తూ ట్వీట్ చేశారు విక్రమ్ కుమార్. గతేడాది ప్రేక్షకుల ముందుకొచ్చిన 'హలో'తో కళ్యాణీ ప్రియదర్శన్ హీరోయిన్‌గా పరిచయమైంది.